ETV Bharat / sitara

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా.. నిర్మాతలు క్లారిటీ

author img

By

Published : Feb 11, 2021, 9:19 AM IST

తారక్​ తర్వాతి చేయబోయే ప్రాజెక్టు ఏంటో తెలిసిపోయింది. 'ఆర్ఆర్ఆర్', త్రివిక్రమ్​తో సినిమా.. ఆ తర్వాత ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ విషయమై నిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారు.

NTR-Prashanth neel combo confirmed by mythri movie makers
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా.. నిర్మాతలు క్లారిటీ

జూ.ఎన్టీఆర్-'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా రానుందని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దీనిపై స్పష్టత వచ్చేసింది. 'ఉప్పెన' విడుదల సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు.. దాని గురించి వెల్లడించారు. 'సలార్' షూటింగ్​ పూర్తయిన తర్వాత తారక్ చిత్రం ప్రారంభమవుతుందని తెలిపారు.

ఎలాంటి కథతో ఈ సినిమా తెరకెక్కిస్తారు? ఇందులోని ఇతర నటీనటులు ఎవరు? అనే విషయాల్ని త్వరలో వెల్లడించే అవకాశముంది. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చేస్తున్న తారక్.. అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్​ సినిమా మొదలయ్యే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.