ETV Bharat / sitara

'థియేటర్లు ఎందుకు ఓపెన్ చేయట్లేదు?'

author img

By

Published : Sep 29, 2020, 10:46 AM IST

కరోనా నిబంధనల కారణంగా ఇప్పటివరకు థియేటర్లు ఓపెన్ కాలేదు. దీంతో చాలా మంది థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా అంటూ ఎదురుచూస్తున్నారు. తాజాగా బార్లు, రెస్టారెంట్లు ఓపెన్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. దీంతో థియేటర్లు కూడా ఓపెన్ చేస్తే బాగుంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ కోరాడు.

Nag Ashwin tweet on Theaters Reopen
'థియేటర్లు ఎందుకు ఓపెన్ చేయట్లేదు?'

కరోనా కారణంగా థియేటర్లు మూసేసి చాలాకాలమైంది. లాక్​డౌన్ నిబంధనల సడలింపుల్లో భాగంగా ఇప్పుడిప్పుడే చిత్రీకరణలు ప్రారంభమయ్యాయి. మెట్రోలు, బస్ సర్వీస్​లు, షాపింగ్ మాల్స్ ఇలా చాలావరకు ఓపెన్ అయ్యాయి. కానీ ఇప్పటివరకు థియేటర్ల ప్రారంభానికి మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో తన మనసులోని మాటలు వెల్లడించాడు దర్శకుడు నాగ్ అశ్విన్.

"నేను అందరి రక్షణ కోసం ఆలోచిస్తా. కానీ జిమ్​లు, బార్లు, రెస్టారెంట్లు, మాల్స్, బస్​, ట్రైన్, ఫ్లైట్లు, మెట్రోలు, దేవాలయాలు ఇలా అన్నీ తెరిచినప్పుడు థియేటర్స్ తెరవడానికి కూడా ఇదే అనువైన సమయం అని భావిస్తున్నా" అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు. మాస్క్ వేసుకొని థియేటర్​లో సినిమాలు చూడటానికి ఎదురు చూస్తున్నామని, అంతే కానీ ఇలాగే స్తబ్ధుగా ఉండిపోవటానికి కాదని వెల్లడించాడు.

  • I'm all for safety, but with gyms, bars, restaurants, malls, temples, bus, train, metro, flights open, it feels about time even movie theaters open...cant wait to mask up and watch movies the way they are meant to be watched...not pause, fast-forward, rewind...

    — Nag Ashwin (@nagashwin7) September 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.