ETV Bharat / sitara

సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న తారలు

author img

By

Published : Mar 19, 2020, 8:04 AM IST

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా పలు సినిమా షూటింగ్​లు రద్దయ్యాయి. దీంతో నటీనటులు తమ ఖాళీ సమయాన్ని వారికి అనుగుణంగా మార్చుకుంటున్నారు. చిత్రీకరణలు లేకపోయినా వారి భవిష్యత్​ ప్రణాళికలపై దృష్టి పెడుతున్నారు.

Movie stars who take advantage of free time
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న తారలు

లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌.. ఈ మాటల మధ్య నిత్యం సందడిగా గడుపుతుంటారు సినీ తారలు. కరోనా ప్రభావంతో కొన్నాళ్లుగా చిత్రీకరణలు ఆగిపోయాయి. దీంతో తారలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇంకొన్నాళ్లు ఇదే పరిస్థితి. విరామం దొరికింది కదా అని కుటుంబ సభ్యులతో గడిపేవాళ్లు కొంతమందైతే.. ఇష్టమైన వ్యాపకాలతో గడుపుతున్నవాళ్లు మరికొందరు.

అనుకోకుండా దొరికిన విరామమైనా పక్కాగా ప్లాన్‌ చేసుకునే పనిలో ఉన్నారంతా. అయితే కొందరు మాత్రం విరామంలోనూ విశ్రమించడం లేదు. సినిమాకు సంబంధించిన పనులపైనే దృష్టిపెట్టి, బిజీగా గడుపుతున్నారు. వాళ్లు ఎవరో, ఏం చేస్తున్నారో ఓసారి చూద్దామా!

లుక్కు కోసం కసరత్తులు

ఈనెల 13నే అల్లు అర్జున్‌ కొత్త చిత్రం కోసం కెమెరా ముందుకెళ్లాల్సింది. కరోనావల్ల చిత్రీకరణ వాయిదా పడింది. దర్శకుడు సుకుమార్‌ నుంచి ఎప్పుడు పిలుపొచ్చినా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాడు అల్లు అర్జున్‌. అయితే అనుకోకుండా వచ్చిన ఈ విరామాన్ని అతడు సినిమా కోసమే వినియోగిస్తున్నాడు. అటవీ నేపథ్యంలో సాగే ఆ చిత్రంలో అల్లు అర్జున్‌ భిన్నమైన లుక్‌లో కనిపించబోతున్నాడట.

Movie stars who take advantage of free time
అల్లు అర్జున్​

అందుకోసం ఇప్పటికే గడ్డం పెంచేశాడు. తన లుక్‌ తెరపై మరింత పక్కాగా ఉండాలనేది అల్లు అర్జున్‌ ఆలోచన. అందుకోసం రోజూ లుక్‌ టెస్టుల్లో పాల్గొంటూ సరిచూసుకుంటున్నాడు. అలాగే చిత్తూరు యాసలో పట్టు పెంచుకుంటున్నాడు. ఇప్పటికే ఒక బృందం అతడికి యాస విషయంలో మెలకువలు నేర్పింది. వేగంగా సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో సుకుమార్‌ ఉన్నాడట. అందుకే ముందే తన బృందాన్ని పక్కాగా సన్నద్ధం చేస్తున్నాడట.

జిమ్‌లో ఫైటర్‌

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ముంబయిలో ఒక దఫా చిత్రీకరణను పూర్తి చేశారు. 'ఫైటర్‌' అనే పేరు ప్రచారంలో ఉంది. ఇది బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రం కాబట్టి విజయ్‌ దేవరకొండ ఇందులో మరింత ఫిట్‌గా కనిపించబోతున్నాడు. అందుకోసం సిక్స్‌ప్యాక్‌ దేహాన్ని సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ విరామంలోనూ ఈ చిత్రం కోసం అతడు జిమ్‌లో మరిన్ని కసరత్తులు చేస్తున్నాడు. విజయ్​కు రౌడీ పేరుతో ఓ బ్రాండ్‌ ఉంది. దానికి సంబంధించిన వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నాడట.

Movie stars who take advantage of free time
విజయ్​ దేవరకొండ, అనన్య పాండే

కథలు పంపుతారా

చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది హీరోయిన్​ రష్మిక. అనుకోకుండా వచ్చిన ఈ విరామంతో ఆమె మళ్లీ సినిమా కథలపైనే దృష్టిపెట్టింది. మంచి కథలు ఏమైనా ఉంటే... నా మెయిల్‌కి పంపించండి. నేను, మా బృందం వాటిని చదివి, బాగుంటే టచ్‌లోకి వస్తానని చెబుతోంది. ఆమె త్వరలోనే అల్లు అర్జున్‌ చిత్రం కోసం రంగంలోకి దిగబోతోంది.

Movie stars who take advantage of free time
రష్మిక

నితిన్‌ చర్చలు

వచ్చే నెలలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు నితిన్‌. కరోనా ప్రభావంతో పెళ్లి వేడుకల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదట. పెళ్లి పనులు మొదలవ్వడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి.. ఈ విరామంలో తన సినిమా కథలతోనే బిజీగా గడుపుతున్నాడని నితిన్‌ కుటుంబ సభ్యులు వెల్లడించారు. 'రంగ్‌దే'లో నటిస్తున్న నితిన్‌, ఆ తర్వాత సినిమాల కోసం ఇప్పటికే కథలు పక్కా చేసుకున్నాడు. ఆ కథలకు సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్నాడు.

Movie stars who take advantage of free time
నితిన్​

ఇంట్లో నా పని

కరోనా ప్రభావంతో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. సినిమా వాళ్లకు అలా చేయడం కుదరని పని. కానీ వరుణ్‌తేజ్‌ "నేను ఇంటి నుంచి చేస్తున్న పని ఇది" అంటూ ఓ ఫొటోని ట్విటర్‌లో పెట్టాడు. అందులో అతడు బాక్సింగ్‌ సాధన చేస్తూ కనిపించాడు. వరుణ్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు. విశాఖలో ఒక షెడ్యూల్‌ పూర్తయింది. ఈ చిత్రం కోసం వరుణ్‌ ఇప్పటికే బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఈ విరామంలోనూ శిక్షణను కొనసాగిస్తున్నాడని అతడు ట్విటర్‌లో ఉంచిన ఫొటోని చూస్తే అర్థమవుతోంది.

Movie stars who take advantage of free time
వరుణ్​ తేజ్​

ఇదీ చూడండి.. కంఠం కంచు.. మనసు మంచు.. ఆయనే మోహన్‌ బాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.