ETV Bharat / sitara

తెరపై కుదిరితే జంట.. కనులకే పంట

author img

By

Published : Mar 21, 2022, 7:22 AM IST

Updated : Mar 21, 2022, 11:43 AM IST

Movie updates
విజయ్ దేవరకొండ

Movie Couples: కథ తర్వాత నిర్మాతలు.. అందుకు సరిపడే జోడీకి ప్రాధాన్యం ఇస్తారు. జోడిపైనే తమ మార్కెట్​ల లెక్కలు అంచనా వేసుకుంటారు. అయితే.. కొన్ని బృందాలు చాలా రోజులుగా వీరి ఎంపికపై దృష్టిపెట్టాయి. ఆ క్రమంలో పలు జోడీలు దాదాపుగా ఖరారైనట్టే అనే సంకేతాలు పరిశ్రమ నుంచి వస్తున్నాయి.

Movie Couples: హీరోకి తగిన జోడీ.. కథలోని పాత్రకి తగిన కథానాయిక.. నిర్మాతల మార్కెట్‌ లెక్కలకి తగ్గ హీరోయిన్‌.. సినిమా షూటింగ్‌ జరిగే సమయానికి డేట్లు సర్దుబాటు చేసే నాయిక.. ఇలా ఓ సినిమాకి కథానాయికని ఎంపిక చేయడం వెనక చాలా తతంగమే ఉంటుంది. అన్నీ కుదిరితేనే అనుకున్న జంట తెరపై మెరిసేది. కథ తర్వాత సింహభాగం కసరత్తులు జోడీ ఎంపికకి సంబంధించే జరుగుతుంటాయి. కొన్ని బృందాలు చాలా రోజులుగా వీరి ఎంపికపై దృష్టిపెట్టాయి. ఆ క్రమంలో పలు జోడీలు దాదాపుగా ఖరారైనట్టే అనే సంకేతాలు పరిశ్రమ నుంచి వస్తున్నాయి.

  • తెలుగులో ఈ మధ్య అనూహ్యంగా కొన్ని కలయికలు సెట్‌ అయ్యాయి. విజయ్‌ దేవరకొండ - శివ నిర్వాణ కలయిక మినహా మిగతా వాటి గురించి పరిశ్రమలో పెద్దగా ప్రచారం జరగలేదు. కథ పక్కా కావడం, ఆ వెంటనే పచ్చజెండా ఊపడం, పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు ఊపందుకోవడం... ఇలా చకచకా జరిగిపోతున్నాయి. ఆ క్రమంలోనే కథానాయికల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగానే కొన్ని కొత్త జంటలు తెరపైకి వస్తున్నాయి.
  • విజయ్‌ దేవరకొండ - శివ నిర్వాణ కలయికలో సినిమా చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నదే. 'లైగర్‌' తర్వాత వెంటనే మరోసారి పూరితో కలిసి విజయ్‌ దేవరకొండ సినిమా చేసే అవకాశాలు కనిపించాయి. ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడానికి ఇంకా సమయం ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో విజయ్‌ దేవరకొండ - శివ నిర్వాణ కలయికలో ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు ఊపందుకున్నాయి. ఇందులో నాయికగా కియారా
    అడ్వాణీని ఎంపిక చేసేందుకు చిత్రబృందం ఆమెని సంప్రదించింది. డేట్లు సర్దుబాటు కాలేదు. దాంతో సమంతని ఖాయం చేసినట్టు సమాచారం. అలా విజయ్‌ - సమంత జోడీ ‘మహానటి’ తర్వాత మరోసారి ఖాయమైంది.
Movie Couples
శర్వానంద్​, కృతి శెట్టి
  • కృతిశెట్టి జోరుమీద ఉంది. పట్టాలెక్కే యువ కథానాయకుల కొత్త ప్రాజెక్టులన్నీ ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. శర్వానంద్‌ కథానాయకుడిగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం, పవన్‌కల్యాణ్‌ - సాయి తేజ్‌ కథానాయకులుగా తెరకెక్కుతున్న ‘వినోదాయ చిత్తం’ సినిమా కోసం కృతిశెట్టినే సంప్రదించారని, ఆమె దాదాపుగా ఖాయమైనట్టేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
  • ఇటీవల ప్రచారంలోకొచ్చిన మరో జోడీ రామ్‌ పోతినేని - రష్మిక మందన్న. రామ్‌ పోతినేని కథా నాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీనికోసం రష్మిక మందన్న పేరు ఖాయమైనట్టు తెలుస్తోంది. ఆమెతో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతోంది.
    Movie Couples
    రామ్​, రష్మిక
  • పరిశ్రమలో ప్రచారంలో ఉంటూ, ప్రేక్షకులను ఊరిస్తున్న మరో జోడీ నితిన్‌ - శ్రీలీల. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికగా శ్రీలీల దాదాపుగా ఖాయమైనట్టు అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Movie Couples
నితిన్, శ్రీ లీల
  • ప్రచారంలో ఉన్న ఆ జోడీలు కుదిరాయంటే మాత్రం తెరపై కనులపండువ ఖాయం. కొత్త ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకోవడంలో నయా భామలు కృతిశెట్టి, శ్రీలీల జోరు ప్రదర్శిస్తున్నారు.
  • చిరంజీవి కథా నాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలోనూ రవితేజ - నివేథా పేతురాజ్‌ జోడీ సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌ - మారుతి కలయికలో సినిమాకి సంబందించీ మాళవిక మోహనన్‌, శ్రీలీల, కృతిశెట్టి తదితర భామల పేర్లు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: 'ప్రభాస్‌తో మళ్లీ బాహుబలి-3లో నటిస్తా'

Last Updated :Mar 21, 2022, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.