ETV Bharat / sitara

మెగాస్టార్ వాయిస్ ఓవర్​తో 'రంగమార్తాండ'

author img

By

Published : Oct 26, 2021, 3:04 PM IST

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న చిత్రం 'రంగమార్తాండ'(rangamarthanda telugu movie). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ మెగా సర్​ప్రైజ్ ఇచ్చారు కృష్ణవంశీ(krishna vamsi movies). ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్​(chiranjeevi voice over movies) ఇస్తున్నారని వెల్లడించారు. అందుకు సంబంధించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

Chiranjeevi
చిరంజీవి

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం 'రంగమార్తాండ'(rangamarthanda telugu movie). మరాఠీలో సూపర్‌హిట్‌ విజయాన్ని సొంతం చేసుకున్న 'నటసామ్రాట్‌' చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్​డేట్ ఇచ్చారు కృష్ణవంశీ(krishna vamsi movies). ఈ చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌(chiranjeevi voice over movies) అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంగళవారం మధ్యాహ్నం కృష్ణవంశీ ఓ ట్వీట్‌ చేశారు. చిరుకు ధన్యవాదాలు తెలిపారు.

నాటకాన్ని ప్రాణంగా భావించి.. దాన్నే ఆధారంగా చేసుకుని జీవించే కళాకారులు, వారి కష్టాలను తెలియజేసేలా ఈ సినిమా సిద్ధమవుతోంది. ప్రకాశ్‌రాజ్‌(prakash raj movies), రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఆదర్శ్‌ బాలకృష్ణ, అనసూయ, రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాత్మిక రాజశేఖర్‌ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఇవీ చూడండి: బాలకృష్ణ టాక్​షోలో మోహన్‌బాబు,నాగబాబు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.