ETV Bharat / sitara

Cinema News: అనుపమ క్యూట్​ లుక్.. గాయని చిన్మయి కొత్త గెటప్

author img

By

Published : Sep 10, 2021, 6:19 PM IST

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. భవదీయుడు భగత్​సింగ్, 18 పేజెస్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్, సామాన్యుడు చిత్రాల కొత్త కబుర్లు ఇందులో ఉన్నాయి.

MOVIE UPDATES
మూవీ అప్డేట్స్

*పవర్​స్టార్ పవన్​కల్యాణ్ 'భవదీయుడు భగత్​సింగ్'(pawan kalyan bhagat singh) ఫస్ట్​లుక్ అభిమానులకు తెగ నచ్చేసింది. ఈ విషయమై అందరికీ ధన్యవాదాలు చెప్పింది చిత్రబృందం. త్వరలో షూటింగ్​ ప్రారంభమయ్యే ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకుడు. మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

.
.

*'18 పేజెస్'(18 pages) హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(anupama parameswaran) ఫస్ట్​లుక్​ రిలీజైంది. నందిని పాత్రలో ఆమె కనిపించనుంది. వినాయక చవితి కానుకగా మోషన్​ పోస్టర్​ను విడుదల చేశారు. నిఖిల్ హీరోగా నటిస్తుండగా, పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్, కథ అందించగా.. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

.
.

*ప్రముఖ గాయని చిన్మయి(chinmayi).. నటిగా మారింది. అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'(akhil most eligible bachelor) సినిమాలో ఆమె ఓ పాత్ర చేసింది. శుక్రవారం ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్​గా నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్. అక్టోబరు 8న థియేటర్లలోకి ఈ చిత్రం రానుంది.

.
.

*విశాల్ 'సామాన్యుడు'(vishal samanyudu movie) సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు ఈ విషయాన్ని వెల్లడించారు. శరవణన్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించారు.

.
.
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.