ETV Bharat / sitara

వివాదాస్పద 'ముంబయి' ట్వీట్​పై కంగన వివరణ

author img

By

Published : Sep 5, 2020, 10:12 AM IST

Updated : Sep 5, 2020, 11:43 AM IST

ముంబయి గురించి తాను ఇటీవలే చేసిన వ్యాఖ్యలతో నటి కంగన రనౌత్​పై తీవ్ర విమర్శలు, విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో మరో ట్వీట్​లో వివరణ ఇచ్చింది.

kangana ranaut toned down on her controversial tweets
నటి కంగనా రనౌత్

ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నటి కంగనా రనౌత్.. తీవ్ర విమర్శలు రావడం వల్ల ఆ విషయమై వెనక్కు తగ్గింది. ముంబయి తన సొంతిల్లు లాంటిదని, అక్కడి ప్రజలు తనను అర్థం చేసుకుంటారని ట్వీట్ చేసింది.

kangana ranaut tweet
కంగనా రనౌత్ ట్వీట్

"మహారాష్ట్ర ప్రజలు, స్నేహితులు, మద్దతుదారులు.. ఈ విషయంలో నన్ను కచ్చితంగా అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను. వారికి నా ఉద్దేశం ఏంటో తెలుసు. కాబట్టి తప్పుగా అనుకోరు. ముంబయి నా స్వస్థలం. దానిపై నాకున్న ప్రేమను ఇతరులతో పంచుకోవాల్సిన పనిలేదు" -కంగనా రనౌత్ ట్వీట్

ఇటీవలే సుశాంత్‌ సింగ్‌ మృతి కేసు గురించి మాట్లాడుతూ.. మూవీ మాఫియా కంటే ముంబయి పోలీసులంటేనే తనకు ఎక్కువ భయంగా ఉందని కంగన విమర్శించింది. దీనితో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, ఆమెను ముంబయి తిరిగి రాకుండా మనాలిలో ఉండిపోవాలని సూచించారు. స్పందించిన కంగనా రనౌత్ ఇది తనను బహిరంగంగా బెదిరించడమేనని.. ముంబయి పాక్‌ ఆక్రమిత కశ్మీరులా (పీఓకే) అనిపిస్తోందని ట్వీట్‌ చేసింది.

దీంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈమె వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. 'స్టార్ కావాలనే నీ ఆశను నెరవేర్చిన నగరం ముంబయి. దీనిని నువ్వు పీవోకేతో పోల్చడం భయంకరం' అని నటి రేణుకా సహానీ చెప్పారు. ఈమెతో పాటు సోనూసూద్, ఊర్మిళ మతోండ్కర్, రితేశ్ దేశ్​ముఖ్, దియా మీర్జా తదితరులు కూడా ట్వీట్లు చేశారు.

Last Updated : Sep 5, 2020, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.