ETV Bharat / sitara

త్రివిక్రమ్​ దర్శకత్వంలో మోహన్​లాల్​, ఎన్టీఆర్​!

author img

By

Published : Aug 18, 2020, 5:32 AM IST

Updated : Aug 18, 2020, 10:27 AM IST

Jr NTR To Pair Up With Mohanlal For The Second Time in trivikram film
త్రివిక్రమ్​ దర్శకత్వంలో మోహల్​లాల్​, ఎన్టీఆర్​!

మలయాళ సూపర్​స్టార్​ మోహన్​లాల్​, యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ కలిసి మరోసారి తెర పంచుకోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్​ వర్గాలు. వీరిద్దరూ కలిసి త్రివిక్రమ్​ దర్శకత్వంలో నటించనున్నారని సమాచారం. 'ఆర్ఆర్​ఆర్​' చిత్రీకరణ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

'జనతా గ్యారేజ్​' తర్వాత మరోసారి జూనియర్ ఎన్టీఆర్​, మోహన్​లాల్​ కలిసి నటించనున్నారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్​ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో వీరిద్దరూ కలిసి తెరపై కనువిందు చేయనున్నారని సమాచారం. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్‌ ఈ చిత్రానికి సంబంధించిన కథ పూర్తి చేశారని తెలుస్తోంది.

'అల వైకుంఠపురములో' విడుదల తర్వాత నుంచి త్రివిక్రమ్​.. ఎన్టీఆర్‌ చిత్రంపైనే దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించబోయే చిత్రం కోసం రంగంలోకి దిగుతారు. ఎన్టీఆర్‌ నటించబోయే 30వ చిత్రమిది. ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్‌రామ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Last Updated :Aug 18, 2020, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.