ETV Bharat / sitara

Jr NTR Interview: రాజమౌళి, చరణ్​ను ఎన్టీఆర్​ ఏ వంటకంతో పోల్చారంటే?

author img

By

Published : Jan 5, 2022, 5:38 PM IST

Jr NTR Interview: ప్రముఖ కథానాయకుడు జూనియర్​ ఎన్టీఆర్​ను ఇంటర్వ్యూ చేశారు బాలీవుడ్ నటి సాహెబా బాలీ. ఈ క్రమంలో సాహెబాను అతిథిగా భావించిన ఎన్టీఆర్‌ ఆమెకు హైదరాబాదీ బిర్యానీ, తెలంగాణ చేపల పులుసు, గుంటూరు చికెన్‌ను వడ్డించారు. వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు.

Jr Ntr
జూనియర్ ఎన్టీఆర్

Jr NTR Interview: ప్రముఖ కథానాయకుడు జూనియర్‌ ఎన్టీఆర్‌.. బాలీవుడ్‌ నటి సాహెబా బాలీకి హైదరాబాదీ బిర్యానీతోపాటు పలు పసందైన వంటకాల్ని రుచి చూపించారు. రామ్‌చరణ్‌తో కలిసి ఎన్టీఆర్‌ నటించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఈ సినిమా ప్రచారంలో భాగంగా సాహెబా.. ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో సాహెబాను అతిథిగా భావించిన ఎన్టీఆర్‌ ఆమెకు హైదరాబాదీ బిర్యానీ, తెలంగాణ చేపల పులుసు, గుంటూరు చికెన్‌ను వడ్డించారు. వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. అనంతరం, "ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో మీరు నిజమైన పులితో ఫైట్‌ చేశారట నిజమేనా?' అని సాహెబా ప్రశ్నించగా 'ఏమో.. అయిండొచ్చు, కాకపోవచ్చు' అంటూ తారక్‌ సమాధానం చెప్పకుండా కన్ఫ్యూజ్‌ చేశారు.

'మీకు ఎన్ని భాషలు వచ్చు' అనే ప్రశ్నకు 'తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌' అని ఎన్టీఆర్‌ చెప్పారు. పీరియాడికల్‌ డ్రామా నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి రూపొందించిన పాన్‌ ఇండియా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఆలియాభట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. జనవరి 7న విడుదలకావాల్సి ఉండగా ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా వాయిదా పడింది.

తారక్​ సెలెక్ట్​ చేసిన వంటలివేే..

రాజమౌళి: బిర్యానీ చూడటానికి సింపుల్‌గా ఉంటుంది కానీ వండాలంటే మాత్రం చాలా కష్టపడాలి. దీన్ని తయారు చేయాలంటే అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. రాజమౌళి కూడా అంతే, చూడటానికి సింపుల్‌ ఉంటారు కానీ పని విషయంలో చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంటారు.

రామ్‌చరణ్‌: పానిపూరిని నోట్లో వేసుకోగానే దాని ఫ్లేవర్స్‌ బయపడతాయి. చరణ్‌ కూడా అంతే. తనతో మాట కలిపితే చాలు అన్ని విషయాలూ పంచుకుంటాడు.

ఆలియా భట్‌: ఇరానీ బన్‌ మస్కా ఎంతో ఆరోగ్యకరమైంది. చాలా ప్రత్యేకమైంది ఆలియా భట్‌. అందుకే ఆమె ఇరానీ బన్‌ మస్కా లాంటిది.

అజయ్‌ దేవ్‌గణ్‌: వడా పావ్‌.. ముంబయి లోకల్‌ ఫుడ్‌. అక్కడివారికి ఇది కచ్చితంగా ఉండాల్సిందే. వడా పావ్‌లా అజయ్‌ దేవ్‌గణ్‌ అందరికీ కావాల్సినవారు.

ఇదీ చదవండి:

Madhavan: 'రామ్‌చరణ్‌- ఎన్టీఆర్‌ను చూస్తే అసూయ కలుగుతోంది'

'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్​కు అన్ని కోట్ల ఖర్చా?

RRR: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై హైకోర్టులో పిల్​

మూడు సినిమాలు, ఆరు టికెట్లు అనుకుంటే.. నిరాశే మిగిలెనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.