ETV Bharat / sitara

'అవతార్-2' సినిమా విడుదల ఎప్పుడంటే?

author img

By

Published : May 8, 2019, 12:53 PM IST

విభిన్న కథాంశంతో వచ్చి భాక్సాఫీస్​ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా 'అవతార్'. కొనసాగింపుగా వస్తున్న రెండో భాగం 2021 డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'అవతార్-2' సినిమా విడుదల ఎప్పుడంటే..?

2009లో వచ్చిన 'అవతార్' సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ప్రేక్షకుల్ని ఊహాలోకంలో విహరించేలా చేసింది. వింత వింత జంతువులు, మనుషులు.. తమ గ్రహాన్ని కాపాడుకునేందుకు మానవులతో చేసే పోరాటం ఆద్యంతం ఆకట్టుకుంది. దర్శకత్వం వహించిన జేమ్స్ కామెరూన్​పై ప్రశంసలు వెల్లువెత్తాయి.

అవతార్​కు కొనసాగింపుగా ప్రస్తుతం నాలుగు భాగాల్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా రెండో భాగం విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. 2021 డిసెంబరు 17న తీసుకువస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పేర్కొంది.

tweet
సామాజిక మాధ్యమాల్లో పోస్టర్​ను పంచుకున్న చిత్రబృందం

మొదటి భాగంలో హీరోహీరోయిన్లుగా నటించిన శామ్ వర్తింగ్డన్, జో శాల్దానా ఇందులోనూ అదే పాత్రలు పోషించారు. స్టీఫెన్ లాంగ్, మిచెల్ రోడ్రిగ్జ్, వీవర్.. మిగతా పాత్రల్లో కనిపించనున్నారు.

still from cinema
సినిమాలోని ఓ స్టిల్
AP Video Delivery Log - 0500 GMT News
Wednesday, 8 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0408: Guatemala Shooting No access Guatemala 4209843
Inmates killed in Guatemala prison riot shooting
AP-APTN-0347: Australia Fiji Climate No access Australia 4209842
Fiji PM slams Australia politicians over climate
AP-APTN-0322: US Pence Venezuela AP Clients Only 4209841
US VP on Venezuela sanctions, hospital ship
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.