ETV Bharat / sitara

Cinema news: సినీ పరిశ్రమ టార్గెట్ రూ.10 వేల కోట్లు

author img

By

Published : Oct 18, 2021, 6:38 AM IST

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ థియేటర్లు(theatres open) దాదాపుగా తెరుచుకున్నాయి. దీంతో ఈ ఏడాది మిగిలిన నెలలతో పాటు వచ్చే ఏడాది సినిమాల ద్వారా భారీగా ఆర్జన ఉంటుందని అంచనా వేస్తున్నారు సినీ పండితులు.

indian cinema industry target 2022 is 10 thousand crore
థియేటర్లు

కరోనా(coronavirus cases) కొట్టిన దెబ్బ చిత్ర పరిశ్రమకు చాలా బలంగా తగిలింది. ఆ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు(theatres open) తెరచుకున్నాయి. కొన్ని చోట్ల ఇంకా లేదు. భారతీయ చిత్ర పరిశ్రమకు కీలకంగా నిలిచే మహారాష్ట్రలో(theatres in mumbai) ఈ నెల 22 తర్వాత థియేటర్లు తెరచుకోనుండటం వల్ల సినిమాలు వరస కడుతున్నాయి. ఈ నెలాఖరుకు సుమారు అన్నిచోట్లా థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నాలుగు నెలల కాలంలో 100 సినిమాలకు పైగా విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో భారతీయ చిత్ర పరిశ్రమ ఒకప్పటి వైభవంతో కొత్తకాంతులు విరజిమ్ముతుందని అందరి నమ్మకం. ఆ దిశగానే హిందీ చిత్రసీమతో పాటు ఇతర భాషా సినీ పరిశ్రమలూ వేగంగా అడుగులు వేస్తున్నాయి.

కరోనా రాకముందు అంటే 2019లో భారతీయ చిత్ర పరిశ్రమకు(indian cinema father) కాసుల పంట పండింది. అన్ని భాషల్లోనూ కలిసి సుమారు రూ.10,000 కోట్లు ఆ ఏడాదిలో వచ్చాయి. వచ్చే ఏడాది కచ్చితంగా అలాంటి భారీ మొత్తాన్ని చిత్రసీమ చూస్తుందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు.

.
.

* వచ్చే నాలుగు నెలల్లో ప్రతివారం తక్కువలో తక్కువ 5 నుంచి 6 చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిల్లో కనీసం రెండైనా భారీ అంచనాలున్నవి.

* ఈ ఏడాది చివరి నాటికి సుమారుగా రూ.4000 - 6000 కోట్లు బాక్సాఫీసు వద్ద వసూళ్లు దక్కనున్నట్టు ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు.

* నాలుగు నెలల కాలంలో రానున్న చిత్రాల్లో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతి రెండో వారం కచ్చితంగా ఒకటి లేదా రెండు భారీ విజయాలు సాధించడం ఖాయం అని అంచనా.

* ఈ నెల 23 నుంచి మహారాష్ట్రలో థియేటర్లు తెరిచాకా లెక్కేసుకుంటే దేశం మొత్తంలో 98శాతం తెరలు అందుబాటులోకి వచ్చేస్తాయి. మొత్తంగా 3000 మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు సందడి చేయనున్నాయి.

* "వారం వారానికి విడుదలయ్యే సినిమాల సంఖ్య, ఆదాయం 25 శాతం పెరగనుంది. కనీసం ప్రతి రెండు వారాలకు ఓ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఖాయం. ఇది మరింత పెరగొచ్చు కూడా" అని అంటున్నారు మల్టీప్లెక్స్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ కమల్‌ జ్ఞాన్‌చందాని.

.
.

* గతేడాది మార్చి వరకే థియేటర్లు తెరచుకోవడం వల్ల ఆదాయం రూ.2000 కోట్లు మించలేదు. ఈ ఏడాది ఇంకా మూడు నెలలు ఉంది కాబట్టి విడుదల కాబోయే సినిమాలు కూడా భారీ చిత్రాలు కావడం వల్ల 2021లో రూ.6000 కోట్లు కచ్చితంగా వస్తాయని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

* ఈ నెల 23 తర్వాత మహారాష్ట్రలో 1000 తెరలు అందుబాటులోకి రానుండటం వల్ల ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.