ETV Bharat / sitara

'కృతిశెట్టితో అందుకే రొమాన్స్​ చేయలేను'

author img

By

Published : Sep 6, 2021, 2:44 PM IST

I don't want to do film with Kriti Shetty: Vijay Sethupati
కృతిశెట్టితో రొమాన్స్​ చేయలేను

'ఉప్పెన' సినిమాలో బేబమ్మ పాత్రలో నటించిన కృతిశెట్టితో తాను రొమాన్స్ చేయలేనన్నారు నటుడు విజయ్‌ సేతుపతి. తాను కథానాయకుడిగా చేయనున్న ఓ సినిమాలో కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేయగా.. అందుకు నో చెప్పారు విజయ్​. 'లాభం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

కృతిశెట్టితో(Krithi Shetty movies) తాను సినిమా చేయలేనని ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi movies)అన్నారు. కృతిశెట్టి-వైష్ణవ్‌ తేజ్‌ జంటగా నటించిన 'ఉప్పెన' చిత్రంలో విజయ్‌ సేతుపతి ఆమె తండ్రి పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో విజయ్‌ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర పోషించారు. కాగా, తాజాగా 'లాభం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. తాను కథానాయకుడిగా చేయనున్న ఓ సినిమాలో కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేశారని అన్నారు.

Kriti Shetty
కృతిశెట్టి

"ఉప్పెన'లో బేబమ్మ(కృతిశెట్టి) తండ్రి పాత్రలో నటించి తెలుగువారికి చేరువయ్యా. ఆ సినిమా విడుదలైన కొన్ని నెలల తర్వాత తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ చేశా. అందులో కథానాయికగా కృతిశెట్టిని ఎంచుకుంటే బాగుంటుందని టీమ్‌ భావించి.. ఆమె ఫొటో నాకు పంపించారు. నేను వెంటనే వాళ్లకు ఫోన్‌ చేసి.. 'ఇటీవల ఓ సినిమాలో నేను ఆమెకు తండ్రిగా నటించా. కూతురు పాత్ర పోషించిన ఆమెతో రొమాన్స్‌ చేయలేను. కాబట్టి ఆమె వద్దు' అని చెప్పాను. 'ఉప్పెన' క్లైమాక్స్‌ షూట్‌ చేస్తున్నప్పుడు ఆమె కొంచెం కంగారు పడింది. దాంతో నేను.. 'బేబమ్మ.. నాకు నీ వయసు కొడుకే ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే. భయపడకు. ఎలాంటి కంగారు లేకుండా ధైర్యంగా చెయ్‌' అని ప్రోత్సహించా. కూతురిలా భావించిన ఆమెకు జోడీగా నటించడం నా వల్ల కాదు" అని విజయ్‌ సేతుపతి వివరించారు.

Vijay Sethupati
విజయ్‌ సేతుపతి

ఇక, 'లాభం' సినిమా విషయానికి వస్తే.. వ్యవసాయం, దళారీ వ్యవస్థ, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలియజేసే విధంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో విజయ్‌ రైతు సమస్యలపై పోరాడే వ్యక్తిగా కనిపిస్తారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఎస్‌.పి.జననాథన్‌ దర్శకుడు. ఇమాన్‌ సంగీతం అందించారు. సెప్టెంబర్‌ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

ఇదీ చూడండి: వారి కోసం 'శ్రీదేవి సోడా సెంటర్' స్పెషల్​ షో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.