ETV Bharat / sitara

'డిస్కోరాజా'.. అభిమానులు మెచ్చిన మాస్ మహారాజా

author img

By

Published : Jan 26, 2020, 8:26 AM IST

Updated : Feb 18, 2020, 10:49 AM IST

మాస్ మహారాజా రవితేజ.. నేడు 53వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఇటీవలే 'డిస్కోరాజా' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఇతడి గురించే ఈ ప్రత్యేక కథనం.

'డిస్కోరాజా'.. అభిమానులు మెచ్చిన మాస్ మహారాజా
హీరో రవితేజ పుట్టినరోజు ప్రత్యేకం

పవర్‌ ఫుల్‌ నటన... కేర్‌ లెస్‌ ఆటిట్యూడ్‌... యూత్‌ ఫుల్‌ ఎనర్జీ... తెరపై కనిపించిన ప్రతిసారీ పరిగెత్తే పాదరసం... ఒక్క చోట కుదురుగా ఉండలేని నైజం... వెరసి రవి శంకర్‌ రాజు భూపతిరాజు. కుర్రకారు మెచ్చే టాలీవుడ్‌ హీరో. పక్కా మాస్‌ చిత్రాల నాయకుడు. రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న రవి శంకర్‌ రాజు భూపతిరాజు... ఎవరా? అని అంతగా ఆలోచించక్కర్లేదు. రవితేజ అనే నాలుగక్షరాల్లో ఇమిడిపోయిన ఎనర్జిటిక్‌ స్టార్‌. మరో మాటలో చెప్పాలంటే మాస్‌ మహారాజా. తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రల్లో మెరిసి సహాయ దర్శకుడిగా తెరవెనుక పనిచేసి... అనంతరం వెండితెరపై హీరోగా తళుక్కుమని... తన హవా ఇప్పటికీ కొనసాగిస్తూ ఎందరో అభిమానుల్ని పొందిన రవితేజ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం.

బాల్యమంతా ఉత్తరాదిలోనే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో రవితేజ 1968 జనవరి 26న రవితేజ పుట్టాడు. అసలు పేరు రవి శంకర్‌ రాజు భూపతిరాజు. తండ్రి రాజ్‌ గోపాల్‌ రాజు ఫార్మసిస్ట్‌గా పని చేసేవారు. తల్లి రాజ్యలక్ష్మి భూపతిరాజు గృహిణి. ముగ్గురు కొడుకులలో రవితేజ పెద్దవాడు. తండ్రి పని రీత్యా తరుచూ పలు ప్రాంతాలకు మారడం వలన రవితేజ బాల్యం ఎక్కువగా ఉత్తర భారతదేశంలో గడిచింది. తెలుగు, హిందీ భాషలలో అనర్గళంగా మాట్లాడే రవితేజ.. విద్యాభ్యాసం జైపూర్, ఢిల్లీ, ముంబయి, భోపాల్‌ల్లో జరిగింది. తర్వాత విజయవాడకు వీరి కుటుంబం మారింది. 1988లో సినిమాల్లో కెరీర్‌ను మొదలుపెట్టాలన్న ఉద్దేశంతో చెన్నైకి వెళ్లాడు.

చిన్న పాత్రల్లో మెరిసి

చెన్నైలో రవితేజ ఉండే గదిలోనే ప్రముఖ దర్శకులు వైవిఎస్‌ చౌదరి, గుణశేఖర్‌ ఉండేవారు. 'కర్తవ్యం', 'చైతన్య', 'ఆజ్‌ కా గూండా రాజ్‌' ('గ్యాంగ్‌ లీడర్‌' హిందీ రీమేక్‌)లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు రవితేజ. ఒక పక్క నటిస్తూనే మరో పక్క సహాయ దర్శకుడిగా, బుల్లితెరకూ పని చేసేవాడు రవితేజ. సహాయ దర్శకుడిగా బాలీవుడ్, టాలీవుడ్​లో ఎన్నో ప్రాజెక్టులకు వర్క్‌ చేశాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'నిన్నే పెళ్లాడతా' సినిమాకూ సహాయ దర్శకుడిగా చేశాడు. అందులోని ఓ చిన్న పాత్రలోనూ నటించాడు.

HERO RAVITEJA BIRTHDAY SPECIAL
హీరో రవితేజ

'సింధూరం'లో కీలకపాత్ర

1997లో సహాయ దర్శకుడిగా వర్క్‌ చేస్తున్నప్పుడు రవితేజకు, కృష్ణవంశీ 'సింధూరం'లో ప్రధాన పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత 'సీతారామరాజు', 'పాడుతా తీయగా', 'మనసిచ్చి చూడు', 'ప్రేమకు వేళయెరా' చిత్రాల్లో నటించే అవకాశాలు రవితేజాను వరించాయి. 1999లో రవితేజ ప్రధాన పాత్రలో శ్రీను వైట్ల దర్శకత్వంలో 'నీ కోసం' సినిమా రూపుదిద్దుకొంది. ఆ తరువాత 'సముద్రం', 'అన్నయ్య', 'బడ్జెట్‌ పద్మనాభం' సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు పోషించాడు. 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి', 'తిరుమల తిరుపతి వెంకటేశ', 'సకుటుంబ సపరివారసమేతం', 'అమ్మాయి కోసం' వంటి మల్టీస్టారర్‌ల్లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

కమర్షియల్‌ సక్సెస్‌

2001లో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం'లో హీరోగా నటించాడు రవితేజ. ఈ చిత్రం కమర్షియల్‌గా హిట్ అయింది. అక్కడినుంచి రవితేజ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2002లో వంశీ దర్శకత్వంలో 'ఔను... వాళ్లిద్దరు ఇష్టపడ్డారు' విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద విజయమందుకొన్న ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలూ అందుకొన్నారు రవితేజ. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇడియట్‌' బ్లాక్‌ బస్టర్​గా నిలిచింది. ఇందులో రవితేజ పెర్ఫార్మన్స్, డైలాగ్‌ డెలివరీకి విమర్శకుల నుంచి ప్రశంసలు బాగా వచ్చాయి.

HERO RAVITEJA BIRTHDAY SPECIAL
హీరో రవితేజ కొత్త సినిమా పోస్టర్

పూరి చిత్రాల హీరో

2002లోనే కృష్ణవంశీ 'ఖడ్గం' సినిమా విడుదల అయింది. భారీ విజయం అందుకొంది. ఇందులో నటుడు కావాలనుకునే ఓ యువకుడి పాత్రలో అలరించాడు రవితేజ. 2003లో 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' కోసం పూరీ జగన్నాథ్‌తో మళ్ళీ కలిసి పనిచేశాడు రవితేజ. ఈ చిత్రంలోని రవితేజ నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయి.
2004లో శ్రీనువైట్ల-రవితేజ కాంబినేషన్‌లో 'వెంకీ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్‌ హాఫ్‌లో రవితేజ కామెడీ ఎంతో బాగుందని, అద్దం ముందు తనకు తాను శాపాలు పెట్టుకునే సన్నివేశాలలో రవితేజ ఎంతో బాగా నటించారని రివ్యూలు వచ్చాయి.

అత్యధిక వసూళ్ల చిత్రం 'విక్రమార్కుడు'

2006లో ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించిన 'విక్రమార్కుడు'లో రవితేజ నటించాడు. అప్పటి వరకు రవితేజ నటించిన సినిమాల్లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది. అత్తిలి సత్తిబాబు, విక్రమ్‌ రాఠోడ్‌ పాత్రల్లో ఎంతో వైవిధ్యభరితమైన నటన కనబరిచాడు ఈ హీరో. 'జింతాత' మ్యానరిజమ్‌ను రవితేజ ఎంతో చక్కగా కనబరిచారడని ప్రశంసలు వచ్చాయి.

అదే ఏడాది 'ఖతర్నాక్‌'లో నటించాడు. 2007లో 'దుబాయ్‌ శీను' కోసం మూడోసారి శ్రీనువైట్లతో కలిసి పనిచేశాడు రవితేజ. 2008లో 'కృష్ణ'లో కామెడీతో అలరించాడు. అదే ఏడాది 'నేనింతే' కోసం రవితేజ, పూరీ జగన్నాథ్‌ మళ్లీ కలిసి వర్క్‌ చేశారు.

HERO RAVITEJA BIRTHDAY SPECIAL
హీరో రవితేజ

దర్శకుల హీరో

2009లో డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డితో ‘కిక్‌’ సినిమా కోసం వర్క్‌ చేశాడు రవితేజ. అదే ఏడాది ‘ఆంజనేయులు’ సినిమాలో రవితేజ కనిపించారు. 2010లో ‘శంభో శివ శంభో’, ‘డాన్‌ శీను’ సినిమాలతో ప్రేక్షకులను పలరించాడు.

2011లో విడుదలయిన మొదటి రవితేజ సినిమా ‘మిరపకాయ్‌’. ఈ సినిమాకి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించాడు. ఆ తరువాత రామ్‌ గోపాల్‌ వర్మ డైరెక్ట్‌ చేసిన ‘దొంగల ముఠా’లో నటించాడు. రామ్‌ గోపాల్‌ వర్మ డైరెక్ట్‌ చేసిన ‘కథ స్కీన్ర్‌ ప్లే దర్శకత్వం అప్పల్రాజు’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ఆ ఏడాది రవితేజ చివరి సినిమా రమేష్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘వీర’. ఈ సినిమా తరువాత రవితేజకు ‘మాస్‌ మహారాజ’ ఇమేజ్‌ వచ్చింది.

2012 నుంచి ఇప్పటివరకు

2012లో విడుదల అయిన మొదటి రవితేజ సినిమా ‘నిప్పు’. ఆ తరువాత ‘దరువు’లో కనిపించాడు. ఈ రెండు చిత్రాల తరువాత మళ్లీ మరోసారి దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో రవితేజ ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాకు వర్క్‌ చేశాడు. ఆ ఏడాది విడుదలయిన చివరి రవితేజ సినిమా ‘సారొచ్చారు’. అప్పటివరకు మాస్‌ తరహా పాత్రలను ఎక్కువగా పోషించిన రవితేజ ఈ సినిమాలో సరికొత్తగా క్లాస్‌గా కనిపించాడు. ఈ రకంగా కూడా ప్రేక్షకులను బాగా అలరించగలిగాడు రవితేజ.

2013లో రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘బలుపు’ సినిమా తెరకెక్కింది. ఆ ఏడాది కమర్షియల్‌ విజయాన్ని అందుకొన్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకోగలిగింది.

HERO RAVITEJA BIRTHDAY SPECIAL
హీరో రవితేజ

2014లో ‘రోమియో’, సినిమాలో ఓ అతిథి పాత్రలో నటించాడు రవితేజ. ఆ తరువాత నూతన దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పవర్‌’ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. 2015లో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మాతగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘కిక్‌ 2’ సినిమాలో నటించాడు రవితేజ. భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఆ తరువాత సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘బెంగాల్‌ టైగర్‌’లో నటించారు రవితేజ. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. అలాగే ఆ ఏడాది ఎక్కువ వసూళ్లు రాబట్టిన ఎనిమిదవ సినిమాగా నిలిచింది.

ఒక ఏడాది విరామం తరువాత, ‘టచ్‌ చేసి చూడు’, ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలలో నటించడానికి ఒప్పుకున్నారు రవితేజ. ‘రాజా ది గ్రేట్‌’ సినిమా మంచి విజయం అందుకోగా... ‘టచ్‌ చేసి చూడు’ సినిమా మాత్రం అభిమానులను నిరాశపరిచింది. ఆ తరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ సినిమాలో నటించాడు. ఆ తరువాత రవితేజ నటించిన సినిమా ‘డిస్కో రాజా’ జనవరి 24, 2020న విడుదలైంది.

HERO RAVITEJA BIRTHDAY SPECIAL
'డిస్కోరాజా' హీరో రవితేజ

పురస్కారాలు

‘నీ కోసం’, ‘ఖడ్గం’ సినిమాలకు నంది స్పెషల్‌ జ్యూరీ పురస్కారాన్ని అందుకొన్నారు రవితేజ. ‘నేనింతే’ చిత్రంలోని పాత్రకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకొన్నాడు.

అతిథి పాత్రల్లో

రవితేజ అతిథి పాత్రల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించాడు. ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’, ‘కథ స్కీన్ర్‌ ప్లే దర్శకత్వం అప్పల్రాజు’, ‘రోమియో’, ‘దొంగాట’ చిత్రాల్లో తళుక్కుమని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

గాయకుడిగా

‘పవర్‌’ చిత్రంలోని ‘నోటంకి నోటంకి’ పాటను ఆలపించాడు రవితేజ. అలాగే ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో ‘రాజా ది గ్రేట్‌’ పాటను ఆలపించాడు. ‘బలుపు’లోనూ ఓ పాటను పాడాడు. ‘మర్యాద రామన్న’, ‘దూసుకెళ్తా’, ‘అ’ సినిమాలకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు రవితేజ.

వివాహం

రవితేజ భార్య పేరు కళ్యాణి. వీరి వివాహం 2000వ సంవత్సరంలో జరిగింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Fox Studios, Los Angeles, California, USA. 25th January, 2020
+++++Scripts to come shortly++++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: FOX
DURATION: 05:45
STORYLINE:
WBC World Heavyweight Champion Deontay Wilder and Lineal World Heavyweight Champion Tyson Fury addressed the media at a pre-fight press conference Saturday (25th January) at the Fox studios in Los Angeles ahead of their word title fight February 22nd at Staples Center.
Last Updated : Feb 18, 2020, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.