ETV Bharat / sitara

తిరుపతిలో సినీ నటుడు ప్రదీప్ సందడి

author img

By

Published : Feb 3, 2021, 1:48 PM IST

సినీ నటుడు, వ్యాఖ్యాత ప్రదీప్ మాచిరాజు తిరుపతిలో సందడి చేశారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా.. మంగళవారం తిరుపతిలోని సీఎస్ థియేటర్​కి వెళ్లారు. ప్రేక్షకులను అలరించారు.

hero-pradeep-went-to-tirupathi-for-success-meet-of-his-movie
తిరుపతిలో సినీ నటుడు, వ్యాఖ్యాత ప్రదీప్ సందడి

30 రోజుల్లో ప్రేమించడం ఎలా? చలనచిత్ర కథానాయకుడు ప్రదీప్ మాచిరాజు.. ఏపీలోని తిరుపతిలో సందడి చేశారు. సినిమా విజయోత్సవంలో భాగంగా మంగళవారం తిరుపతిలోని సీఎస్ థియేటర్​కి విచ్చేసి ప్రేక్షకులను అలరించారు.

తిరుపతిలో సినీ నటుడు, వ్యాఖ్యాత ప్రదీప్ సందడి

ఈ సందర్భంగా అభిమానులు ప్రదీప్​తో స్వీయచిత్రాలు దిగేందుకు ఆరాటపడ్డారు. తన మొదటి సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేసినందుకు ప్రదీప్ కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర దర్శకుడు మున్నా, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : పెళ్లికి సిద్ధమైన మరో యువ హీరో.. ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.