ETV Bharat / sitara

సినిమాల్లోకి సైఫ్ అలీఖాన్​​ వారసుడు

author img

By

Published : Nov 4, 2020, 7:24 PM IST

Updated : Nov 4, 2020, 7:51 PM IST

బాలీవుడ్​ నటుడు సైఫ్​ అలీఖాన్​ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ త్వరలోనే​ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని సైఫ్​ స్పష్టం చేశాడు.

Saif Ali Khan
సైఫ్​ అలీఖాన్​ తనయుడు

బాలీవుడ్​ నటుడు సైఫ్​ అలీఖాన్​ కుటుంబం నుంచి మరొకరు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. సైఫ్​ తనయుడు ఇబ్రహీం అలీఖాన్​ త్వరలోనే సినిమాల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని సైఫ్​ స్పష్టం చేశాడు. అయితే ఇబ్రహీ ఏ సినిమాతో రానున్నాడో చెప్పలేదు.

"ఇబ్రహీం సినిమాల్లోకి వచ్చే విధంగా కెరీర్​ను ప్రణాళిక చేసుకుంటున్నాడు. నా పిల్లలంతా చిత్రరంగాన్ని వృత్తిగా ఎంచుకోవాలని నేను కోరుకుంటాను. పనిచేయడానికి సినిమా రంగం ఎంతో ఉత్తమమైన ప్రదేశం. నేను 17-18ఏళ్ల వయసులో పక్కదారి పడుతున్న సమయంలో నటన నన్ను కాపాడింది. బాధ్యతను గుర్తుచేసింది. నాకంటూ ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ వృత్తి నాకు కావాల్సిందానికన్నా ఎక్కువే ఇచ్చింది. ఎంతో సంతృప్తి చెందాను."

-సైఫ్​ అలీఖాన్​, బాలీవుడ్​ నటుడు

సైఫ్​ అలీఖాన్​.. ప్రభాస్​ నటించబోతున్న పాన్​ ఇండియా సినిమా 'ఆదిపురుష్'​లో రావణుడి పాత్రకు ఎంపికయ్యాడు. దీంతో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయన కూతురు సారా అలీఖాన్​ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

ఇదీ చూడండి ఈ జంట చిందేస్తే.. సినిమా సూపర్ హిట్!

Last Updated : Nov 4, 2020, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.