ETV Bharat / sitara

Oscars 2022: ఉత్తమ నటుడు విల్​స్మిత్​.. ఆస్కార్​ విజేతలు వీరే

author img

By

Published : Mar 28, 2022, 8:01 AM IST

Updated : Mar 28, 2022, 4:47 PM IST

Oscars 2022: ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ పురస్కారాల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. విల్​స్మిత్​.. ఉత్తమ నటుడిగా ఆస్కార్​ అందుకున్నారు. ఊహించిన విధంగానే 'డ్యూన్'​ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఆస్కార్​ 2022 విజేతలు ఎవరంటే?
Oscars 2022
dune

ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొనే అకాడమీ అవార్డుల(ఆస్కార్‌) ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కరోనా పరిస్థితులతో గత రెండేళ్లు అంతగా సందడిలేని ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 94వ అకాడమీ అవార్డుల వేడుకలో వివిధ విభాగాల్లో 'డ్యూన్‌' హవా కొనసాగింది. ఫిల్మ్‌ ఎడిటింగ్‌, బెస్ట్‌ సౌండ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ వంటి విభాగాల్లో 'డ్యూన్‌' బృందం ఆస్కార్‌ని ముద్దాడింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విజేతలు వీళ్లే..

  • ఉత్తమ చిత్రం: కోడా
  • ఉత్తమ నటి: జెస్సీకా చాస్టెయిన్‌( ది ఐస్‌ ఆఫ్‌ టమ్మీ ఫేయీ)
  • ఉత్తమ నటుడు: విల్‌ స్మిత్‌ (కింగ్‌ రిచర్డ్‌)

గతంలో రెండుసార్లు నామినేట్ అయ్యి అవార్డు పొందలేకపోయిన విల్‌ స్మిత్.. మూడో ప్రయత్నంలో ఆస్కార్ దక్కించుకున్నాడు. టెన్నిస్ క్రీడాకారిణులు సెరెనా, వీనస్ విలియమ్స్‌ తండ్రి, కోచ్ రిచర్డ్ విలియమ్స్ జీవితకథ ఆధారంగా 'కింగ్ రిచర్డ్' సినిమా రూపొందగా.. రిచర్డ్ పాత్రలో విల్‌ స్మిత్ నటనకు ఆస్కార్ వరించింది.

  • ఉత్తమ దర్శకుడు: జాన్‌ కాంపియన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్‌ కాట్సర్‌(కోడా)
  • ఉత్తమ సహాయ నటి: అరియానా డిబోస్‌( వెస్ట్‌ సైడ్‌ స్టోరీ)
  • ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: కెన్నెత్‌ బ్రనాగ్‌ (బెల్‌ఫాస్ట్‌)
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: జెన్నీ బేవన్‌ (క్రుయెల్లా)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: గ్రేగ్ ఫ్రేజర్ (డ్యూన్‌)
  • ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: డ్రైవ్‌ మై కార్‌ (జపాన్‌)
  • ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: సియాన్‌ హెడర్‌(కొడా)
  • ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌: బిల్లీ ఎలిష్ (నో టైమ్‌ టు డై)
  • ఉత్తమ సౌండ్‌: మార్క్‌ మాంగినీ, థియో గ్రీన్‌, హెమ్‌ఫిల్‌, రాన్‌ బార్ట్‌లెట్‌ (డ్యూన్‌)
  • ఉత్తమ డ్యాకుమెంటరీ (షార్ట్‌ సబ్జెక్ట్‌‌): ది క్వీన్‌ ఆఫ్‌ బాక్సెట్‌బాల్‌
  • ఉత్తమ షార్ట్‌(యానిమేటెడ్‌): విండ్‌ షీల్డ్‌ వైపర్
  • ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌(లైవ్‌ యాక్షన్‌): ది లాంగ్‌ గుడ్‌బై
  • ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌: డ్యూన్‌
  • ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: డ్యూన్‌
  • ఉత్తమ ప్రొడెక్షన్‌ డిజైన్‌: డ్యూన్‌
  • ఉత్తమ మేకప్‌, హెయిర్‌స్టైలిష్ట్‌: ది ఐస్‌ ఆఫ్‌ ది టామీ ఫై
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: డ్యూన్‌
  • ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌ (యానిమేటెడ్‌): ది విండ్‌షీల్డ్‌ వైపర్‌
  • ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌: ఇన్‌కాంటో

ఇదీ చూడండి: Oscars 2022: భార్యపై అలాంటి జోక్​.. కమెడియన్​ చెంప చెళ్లుమనిపించిన హీరో

Last Updated :Mar 28, 2022, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.