ETV Bharat / politics

కాంగ్రెస్​ మార్పంటే కరెంటు కోతలు, ఐటీ కంపెనీల తరలింపు : కేటీఆర్​ - KTR Comments on CM Revanth Reddy

author img

By ETV Bharat Telangana Team

Published : May 22, 2024, 10:17 PM IST

KTR Comments on CM Revanth Reddy : రైతుబంధు డబ్బులు నాట్ల సమయానికి కాకుండా ఓట్ల సమయానికి పడుతున్నాయని కేటీఆర్​ ఆరోపించారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిన రుణమాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్​, హనుమకొండలో జరిగిన పట్టభద్రుల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.

KTR Comments on CM Revanth Reddy
KTR Comments on CM Revanth Reddy (ETV Bharat)

KTR Fires on Congress Government : కాంగ్రెస్​ చెప్పిన మార్పంటే కరెంటు కోతలు, ఐటీ కంపెనీల తరలింపేనా అని మాజీ మంత్రి కేటీఆర్​ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్​, హనుమకొండలో జరిగిన పట్టభద్రుల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. రైతు బంధు డబ్బులు నాట్ల సమయానికి కాకుండా ఓట్ల సమయానికే పడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా రాష్ట్రంలో రుణమాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు.

అన్ని వడ్లకు రూ.500 బోనస్​ ఇస్తామని చెప్పి రైతులను కాంగ్రెస్​ ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్​ విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రశ్నించే గొంతు కావాలో, యూట్యూబ్​ను అడ్డుపెట్టుకొని దందా చేసే వ్యక్తి కావాలో గ్రాడ్యుయేట్స్​ తేల్చుకోవాలని అన్నారు. మోసాల పరంపర కొనసాగిస్తున్న కాంగ్రెస్​కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కేటీఆర్​ పిలుపునిచ్చారు.

"ఇక్కడేమో గోల్డ్​ మెడలిస్ట్​ ఉన్నాడు. కాంగ్రెస్​లోనేమో గోల్డ్​ ఎత్తుకుని పోయేవాడు ఉన్నాడు. చదువుకున్నవారి ఎలాంటి వ్యక్తి ప్రతినిధిగా ఉండాలి. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రశ్నించే గొంతు కావాలో, యూట్యూబ్​ను అడ్డుపెట్టుకొని దందా చేసే వ్యక్తి కావాలో గ్రాడ్యుయేట్స్​ తేల్చుకోవాలి. కాంగ్రెస్​ చెప్పిన మార్పంటే కరెంటు కోతలు, ఐటీ కంపెనీల తరలింపేనా? రైతు బంధు డబ్బులు నాట్ల సమయానికి కాకుండా ఓట్ల సమయానికే పడుతున్నాయి." - కేటీఆర్, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

రాకేశ్​ రెడ్డి ప్రస్థానం : నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్​ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన నామినేషన్​ కూడా దాఖలు చేశారు. ఉన్నత విద్యావంతుడైన ఏనుగుల రాకేశ్​రెడ్డి స్వస్థలం హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం వంగపహాడ్​. బీజేపీ ఉన్నప్పుడు ఫైర్​ బ్రాండ్​గా పేరు తెచ్చుకున్నారు. నగరంలో అనేక సమస్యలపై పోరాటం చేశారు. పలువురి పేర్లను బీఆర్​ఎస్​ పార్టీ పరిశీలించగా విద్యావంతుడైన రాకేశ్​ రెడ్డి వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది.

ఉపఎన్నికల ఎలా వచ్చింది : 2021 మార్చిలో పల్లా రాజేశ్వర్​ రెడ్డి వరంగల్​-ఖమ్మం-నల్గొండ స్థానానికి ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యారు. ఆ పదవి కాలం 2027 మార్చి వరకు ఉంది. అయితే అంతలోనే ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ శాసనసభ్యుడిగా పోటీ చేయడంతో ఆ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఆ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం మే 27న పోలింగ్​ నిర్వహించడానికి ఏర్పాట్లను చేసింది. దీనికి సంబంధించిన ఓట్లు లెక్కింపు మాత్రం జూన్​ 5న ఉండగా అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.

కాంగ్రెస్​ మార్పంటే కరెంటు కోతలు, ఐటీ కంపెనీల తరలింపు : కేటీఆర్​ (ETV Bharat)

లోక్​సభ పోరు ముగిసింది - ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధాన పార్టీల గురి - Telangana Graduate MLC By Election

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక - ఫుల్ స్వింగ్​లో ప్రచారం - Graduate MLC BY Campaign in TS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.