ETV Bharat / sitara

'రాధేశ్యామ్'​ ఓటీటీలోకి అప్పుడే.. డైరెక్టర్​ రాధాకృష్ణ ట్వీట్​ వైరల్​!

author img

By

Published : Mar 15, 2022, 10:36 AM IST

Updated : Mar 15, 2022, 11:24 AM IST

Director Radhakrishna tweet on Radheshyam: 'రాధేశ్యామ్'​ సినిమాపై ఓ ఆసక్తికరమైన పోస్ట్​ చేశారు దర్శకుడు రాధాకృష్ణ. అది అభిమానుల మనసును తాకుతోంది. కాగా, ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

radheshyam
రాధేశ్యామ్​

Director Radhakrishna tweet on Radheshyam: ప్రభాస్​.. తన యాక్షన్​ ఇమేజ్​ను పక్కనపెట్టి చాలా కాలం తర్వాత ప్రయోగాత్మకంగా చేసిన చిత్రం 'రాధేశ్యామ్'. పీరియాడిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ మిక్స్​డ్​ టాక్​ను దక్కించుకుంది. విజువల్స్​ పరంగా గ్రాండ్​గా ఉన్న ఈ సినిమాను అద్భుతమైన ప్రేమకథగా తీర్చిదిద్దారు దర్శకుడు రాధాకృష్ణ. తాజాగా ఈ మూవీపై మనసుకు హత్తుకునేలా ఓ పోస్ట్​ చేశారాయన.

​ఈ చిత్రంలోని ప్రభాస్​, పూజాకు సంబంధించిన ఓ సన్నివేశాన్ని రాధాకృష్ణతో పోలుస్తూ ఓ ట్వీట్​ చేశారు. తన విజన్​ను ఈ సినిమాలో ఏవిధంగా చూపించారో వివరించారు. "ఉన్నంత కాలం భూమి ఆకాశం నిలిచేటి గాథే ఈ రాధేశ్యామ్​" అని వ్యాఖ్య రాసుకొచ్చారు. ఈ పోస్ట్​ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్​గా నటించగా.. కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించారు. యూవీ క్రియేషన్స్​, టీ సిరీస్​ బ్యానర్లు ఈ సినిమాను నిర్మించాయి.

ఓటీటీలో ఎప్పుడంటే?

Radheshyam OTT Release: రాధేశ్యామ్​ డిజిటల్​ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది అమెజాన్​ ప్రైమ్​. అయితే ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అన్న దానిపై చర్చ నడుస్తోంది. సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్​ అవ్వాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. దీని ప్రకారం ఏప్రిల్​ 11 తర్వాత ఇది ఆన్​లైన్​లో స్ట్రీమింగ్​ అవ్వాలి. కానీ ఏప్రిల్​ 2న ఉగాది పండగ ఉన్నందున అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

ఇదీ చూడండి: హీరోయిన్స్​ హ్యాట్​ లుక్స్​.. ఫొటోషూట్​లో ఇప్పుడిదే ట్రెండ్​!

Last Updated : Mar 15, 2022, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.