ETV Bharat / sitara

50 కోట్ల వీక్షణలతో 'బుట్టబొమ్మ' రికార్డు

author img

By

Published : Jan 7, 2021, 5:27 PM IST

Updated : Jan 7, 2021, 5:47 PM IST

'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'బుట్టబొమ్మ' సాంగ్ యూట్యూబ్​లో రికార్డు సాధించింది. ఈ ప్లాట్​ఫామ్​లో 500 మిలియన్ల వీక్షణలు సాధించిన తొలి తెలుగు పాటగా ఘనత వహించింది.

ButtaBomma Song Crossed 500 million Views
అరకోటి వీక్షణలతో 'బుట్టబొమ్మ' రికార్డు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'బుట్టబొమ్మ' సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు అభిమానులున్నారు. అలాంటి ఈ పాట యూట్యూబ్​లో మరో రికార్డు సాధించింది. ఈ ప్లాట్​ఫామ్​లో 500 మిలియన్ల వీక్షణలు సాధించిన తొలి తెలుగు పాటగా ఘనత వహించింది. అలాగే 3.3 మిలియన్ల లైక్స్​తోనూ దూకుకెళ్తోంది.

బన్నీ, పూజ జంటగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. తమన్ తన పాటలతో సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేశారు. మూవీ విడుదలకు ముందే ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చిందంటే అందుకు కారణం ఈ సినిమా పాటలే. తమన్ సంగీతానికి అర్మాన్ మాలిక్ గాత్రం, అల్లు అర్జున్ స్టెప్పులు 'బుట్టబొమ్మ'కు ప్రాణం పోశాయి. ఈ పాటతో పాటు 'రాములో రాములో' కూడా యూట్యూబ్​లో రికార్డు వ్యూస్​తో కొనసాగుతోంది.

మేకింగ్ వీడియో

'బుట్టబొమ్మ' సాంగ్ వీడియో యూట్యూబ్​లో 50 కోట్ల వీక్షణలు పొందిన సందర్భంగా ఈ పాట మేకింగ్ వీడియోను నెట్టింట షేర్ చేసింది చిత్రబృందం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated : Jan 7, 2021, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.