ETV Bharat / sitara

బాక్సాఫీస్​పై 'భీమ్లానాయక్​' దండయాత్ర.. నైజాంలో ఆల్​టైం రికార్డ్​!

author img

By

Published : Feb 26, 2022, 11:43 AM IST

Bheemla Nayak Oversees Collections: పవన్​కళ్యాణ్ నటించిన​ 'భీమ్లా నాయక్'​ చిత్రం భారీ కలెక్షన్లను అందుకుంటోంది. నైజాం సహా ఓవర్సీస్​లో తొలిరోజు వసూళ్ల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Bheemla Nayak oversees collections
భీమ్లానాయక్ ఓవర్సీస్​ కలెక్షన్స్​

Bheemla Nayak Oversees Collections: పవర్​స్టార్​ పవన్​కళ్యాణ్​ నటించిన 'భీమ్లానాయక్' శుక్రవారం​ విడుదలై బాక్సాఫీస్​ వద్ద అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్​లోనూ దూసుకుపోతోంది. తొలిరోజు అదిరిపోయే కలెక్షన్లను అందుకుంది. నైజాం​లో 11.81కోట్లు షేర్​ వసూలు చేసి ఆల్​టైం రికార్డు సృష్టించినట్లు తెలిసింది. అంతకుముందు 'పుష్ప' 11.4కోట్లు, 'సాహో ' 9.41కోట్లు, 'బాహుబలి 2' 8.9కోట్లు, 'వకీల్​సాబ్'​ 8.75కోట్లు, 'సరిలేరు నీకెవ్వరు' 8.67కోట్లు, 'సైరా' 8.10కోట్లు అందుకున్నాయి.

భీమ్లా నాయక్​ ఓవర్సీస్​లో రూ.8కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకుడు తరన్​ ఆదర్శ్​ ట్వీట్​ చేశారు. అమెరికాలో రూ.6.53 కోట్లు, యూకేలో రూ.87.81 లక్షలు, ఐర్లాండ్​లో రూ.6.44 లక్షలు వసూలు చేసినట్టు వివరించారు. మొత్తంగా భీమ్లా నాయక్​ ఏపీ, తెలంగాణలో తొలిరోజు రూ.26కోట్లకుపైగా షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో టికెట్​ రేట్ల సమస్య ఉన్నప్పటికీ ఈ స్థాయిలో వసూలు చేయడం విశేషం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియుమ్'కు రీమేక్​గా 'భీమ్లానాయక్​' తెరకెక్కింది. ఈ సినిమాలో పవన్​ పోలీస్​ అధికారిగా నటించారు. ఆయన్ను ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యామేనన్, సంయుక్త మేనన్​ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించారు. దర్శకుడు త్రివిక్రమ్​ మాటలు అందించారు.

ఇదీ చదవండి: RC 15: షూటింగ్​ వీడియో లీక్​.. కొత్త లుక్​లో రామ్​చరణ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.