ETV Bharat / sitara

ఓటీటీలో బాలయ్య గర్జన.. టాక్​ షోల్లో 'అన్​స్టాపబుల్​' రికార్డు!

author img

By

Published : Nov 30, 2021, 1:49 PM IST

Unstoppable With NBK: ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న 'అన్​స్టాబుల్​ విత్ ఎన్​బీకే' షో.. అత్యధిక వ్యూస్ పొందిన తెలుగు టాక్ షోగా నిలిచినట్లు సమాచారం.

unstoppable with nbk
బాలకృష్ణ

Unstoppable With NBK Aha: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న 'అన్​స్టాపబుల్ విత్​ ఎన్​బీకే'​ షో దూసుకెళ్తోంది. బాలయ్య చలాకీతనం ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమానికి ఇటీవలే 40 లక్షల వీక్షణలు వచ్చినట్లు ఆహా వెల్లడించింది. తెలుగులో ఒక టాక్​షోకు ఇదే రికార్డు వ్యూస్ అని తెలుస్తోంది.

unstoppable with nbk
ఆహాలో బాలకృష్ణ

తొలి ఎపిసోడ్​లో మోహన్ బాబు అతిథిగా రాగా, రెండో ఎపిసోడ్​లో నేచురల్ స్టార్​ నాని.. బాలయ్యతో కలిసి ప్రేక్షకులను అలరించారు. మూడు వారాలు గ్యాప్ రావడం వల్ల తదుపరి ఎపిసోడ్ ఎప్పుడెప్పుడా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే వారం వారం రావడానికి తాను సీరియల్​ కాదు సెలబ్రేషన్ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్​తో సరికొత్త ప్రోమో (unstoppable with nbk episode 3 promo) విడుదలైంది.

ఇదీ చూడండి: బాలయ్య 'అద్దం' డైలాగ్.. హీరో నానికి మైండ్​బ్లాక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.