ETV Bharat / sitara

'ఆదిపురుష్​'లో సీతగా బాలీవుడ్​ నటి అనుష్కశర్మ?

author img

By

Published : Sep 12, 2020, 3:08 PM IST

చాలా రోజులుగా వెండితెరకు దూరంగా ఉన్న అనుష్క శర్మ మళ్లీ కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ప్రభాస్​ నటిస్తున్న 'ఆదిపురుష్'​ చిత్రంలో ఈ అందాల భామ నటించనున్నట్లు తెలుస్తోంది. సీత పాత్రలో ఆమె కనిపించబోతుందని వార్తలు వస్తున్నాయి.

Anushka Sharma to play Sita in Prabhas' Adipurush?
ఆదిపురుష్​లో సీతగా.. బాలీవడ్​ నటి అనుష్కశర్మ..?

కథానాయకుడు ప్రభాస్‌, బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆదిపురుష్‌'. ఇందులో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు. అయితే అతడి సరసన నటించబోయే సీత ఎవరన్నది ఇంకా తెలియలేదు. ఈ పాత్రకు మొదట కియారా అడ్వాణి, కీర్తీ సురేశ్‌ పేర్లు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. ఇంతలో సీత పాత్ర కోసం బాలీవుడ్‌ అందాల భామ అనుష్కశర్మను తీసుకునే ప్రయత్నాల్లో చిత్రబృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుష్క చేత ఈ రోల్​ చేయించేందుకు దర్శకుడు ఓం రౌత్‌ సుముఖంగా ఉన్నాడట. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం గర్భవతిగా ఉన్న అనుష్క షూటింగ్‌లో పాల్గొంటుందా..? అనేది సందిగ్ధంగా ఉంది. 2021 జనవరి నాటికి నటి డెలివరీ కానుంది. ఆ తర్వాత కొంత విరామం తర్వాత షూటింగ్​లో పాల్గొనవచ్చు. జనవరిలోనే సినిమా పట్టాలెక్కితే తొలుత అనుష్క శర్మ లేని సన్నివేశాలను చిత్రీకరించేలా ప్రణాళికలు రచిస్తోందట చిత్రబృందం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.