'పుష్ప' అప్డేట్​.. ఊరమాస్​ లుక్​లో అనసూయ

author img

By

Published : Nov 10, 2021, 10:26 AM IST

Updated : Nov 10, 2021, 11:54 AM IST

anasuya

అల్లుఅర్జున్​, రష్మిక జంటగా నటిస్తున్న 'పుష్ప'(pushpa update) సినిమాలో అనసూయ లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్​ సినిమాపై మరింత ఆసక్తిని రేపుతోంది. ఇందులో అనసూయ ఊరమాస్​ లుక్​లో కనిపించి అభిమానుల్ని ఆకట్టుకుంది.

'పుష్ప'(pushpa allu arjun movie) సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్​ వచ్చింది. ఈ చిత్రంలోని అనసూయ లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. దక్షాయనిగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్​ను రిలీజ్​ చేసింది(anasuya latest movie). ఇందులో ఆమె.. నోట్లో ఆకు నములుతూ, చేతిలో కత్తెర పట్టుకొని దర్శనమిచ్చింది. ముఖ్యంగా ఆమె హెయిర్​ స్టైల్​ ప్రత్యేకంగా నిలిచింది. ఈ లుక్​ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అంతకుముందు సుకుమార్​ దర్శకత్వంలో రూపొందిన 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా కనిపించి ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఈ చిత్రంలోని ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప'లోని దక్షాయని పాత్ర కూడా భిన్నంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

anasuya
అనసూయ

భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కుతోన్న 'పుష్ప' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌(sukumar alluarjun movie) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు(alluarjun rashmika movie). ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 'పుష్ప ది రైజ్‌' పేరుతో మొదటి భాగాన్ని డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇదీ చూడండి: 'పుష్ప' అప్డేట్​.. మాస్​లుక్​లో భయపెడుతున్న సునీల్​

Last Updated :Nov 10, 2021, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.