ETV Bharat / sitara

'పూరీ జగన్నాథ్​ సినిమా ఎప్పుడు తీయాలో చెప్పా!'

author img

By

Published : Mar 30, 2021, 10:30 AM IST

Updated : Mar 30, 2021, 3:48 PM IST

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోకు ఈ వారం అతిథులుగా 'చావు కబురు చల్లగా' జంట కార్తికేయ, లావణ్య త్రిపాఠి హాజరయ్యారు. పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో నటించాలనేది తన డ్రీమ్​ అని చెప్పాడు కార్తికేయ. ఇంకా తమ కెరీర్​, కాలేజీ లైఫ్​కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఈ జంట పంచుకున్నారు. అవేంటో చూద్దాం.

karhtikeya
కార్తికేయ

ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో 'చావుకబురు చల్లగా' హీరోహీరోయిన్లు కార్తికేయ, లావణ్య త్రిపాఠి హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆలీ, వారికి మధ్య సాగిన సరదా సంభాషణ ప్రేక్షకులను అలరిస్తోంది.

'చావుకబురు చల్లగా' సినిమాలో పెళ్లైన అమ్మాయికి(లావణ్య త్రిపాఠి) ప్రపోజ్​ చేస్తాడు కార్తికేయ. 'నిజజీవితంలో కూడా పెళ్లైన అమ్మాయికి ప్రపోజ్​ చేశావా' అని ఆలీ అడగగా లేదని కార్తికేయ సమాధానమివ్వడం నవ్వులు పూయిస్తోంది. అయితే కాలేజీ రోజుల్లో తన క్లాస్​మేట్​తో ప్రేమాయాణం సాగించినట్లు కానీ సినిమాల్లోకి రాకముందే అది బ్రేకప్​ అయినట్లు తెలిపాడు కార్తికేయ. తర్వాత.. హీరో కాకముందు దర్శకుడు పూరీజగన్నాథ్​ను కలిసిన సంఘటనను గుర్తుచేసుకున్నాడీ హీరో. 'జ్యోతిలక్ష్మి' షూటింగ్​ సెట్​కు పూరీని కలవడానికి వెళ్తే తొలుత అక్కడి బౌన్సర్లు తనను బయటకు నెట్టేశారని, కానీ ఆ తర్వాత పూరీనే తనను పిలిచి మాట్లాడారని చెప్పాడు. తామిద్దరి మధ్య సాగిన సంభాషణల గురించి వివరించాడు. ఆయనతో సినిమా చేయడం తన డ్రీమ్​ అని మనసులోని మాటను బయటపెట్టాడు.

అలాగే 'అర్జున్​ సురవరం' సినిమా చేసేటప్పుడు తనకు ప్రమాదం తప్పిందని గుర్తుచేసుకుంది హీరోయిన్​ లావణ్య త్రిపాఠి. అది గుర్తుకు వచ్చి రాత్రిపూట నిద్రలో ఉలిక్కిపడి లేచి చాలా భయపడినట్లు చెప్పింది. టాలీవుడ్​లో తనకు ఏ హీరో మీద క్రష్​ లేదని స్పష్టం చేసింది. ఇంకా తన కెరీర్ గురించి పలు విషయాలు పంచుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'టాలీవుడ్​లో ఏ హీరో మీద క్రష్​ లేదు'

Last Updated : Mar 30, 2021, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.