ETV Bharat / sitara

బాక్సాఫీస్​ వార్​: ప్రభాస్​తో తలపడనున్న ఆలియా​

author img

By

Published : Feb 24, 2021, 1:23 PM IST

Updated : Feb 24, 2021, 2:49 PM IST

హీరో ప్రభాస్​ నటిస్తోన్న 'రాధేశ్యామ్', హీరోయిన్​ ఆలియా భట్ నటిస్తున్న 'గంగూబాయి కతియావాడి' బాక్సాఫీస్​ వద్ద పోటీపడనున్నాయి. ఈ రెండు చిత్రాలు ఒకే రోజు జులై 30న విడుదల కానున్నాయి.

prabhas
ప్రభాస్​

హీరో ప్రభాస్​, హీరోయిన్​ ఆలియా భట్​ తలపడటానికి సిద్ధమయ్యారు. అదేంటి వీరిద్దరు కలిసి ఏదైనా సినిమా చేస్తున్నారా అని అనుకుంటారేమో. కాదు.. బాక్సాఫీస్​ యుద్ధానికి సమాయత్తమయ్యారు.

గ్యాంగ్‌స్టర్‌ గంగూబాయ్​ కొతేల్‌వాలి జీవిత కథతో ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చిత్రం 'గంగూబాయి కతియావాడి'. టైటిల్‌ పాత్రలో బాలీవుడ్‌ నాయిక ఆలియా భట్‌ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాను ఈ ఏడాది జులై 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అయితే ఇదే రోజున రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో హీరో ప్రభాస్​ నటిస్తున్న 'రాధేశ్యామ్' సినిమా​ కూడా విడుదల కానుంది. దీంతో ఇరు సినిమాల మధ్య గట్టిపోటీ నెలకొననుంది. మరి ఈ రెండింటిలో అత్యధిక వసూళ్ళను ఏ సినిమా అందుకుంటుందో చూడాలి మరి.

prabhas
ఆలియాభట్​
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అయితే ఈ రెండు సినిమాలే కాకుండా మరికొన్ని చిత్రాలు కూడా ఈ ఏడాది ఒకే రోజున విడుదలకు సిద్ధమయ్యాయి.

ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్ నటించిన 'రాధే' ఈ ఏడాది ఈద్​కు థియేటర్లలోకి రానుండగా.. మరోవైపు మిలాప్​ జవేరీ డైరెక్షన్​లో జాన్​ అబ్రహాం నటించిన 'సత్యమేవ జయతే 2' మే 12న రిలీజ్ కానుంది.

అక్షయ్ కుమార్​ నటిస్తున్న స్పై థ్రిల్లర్​ మూవీ 'బెల్​ బాటమ్' ఏకంగా హాలీవుడ్​ సినిమా 'ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ 9'తో పోటీ పడనుంది. ఈ రెండు చిత్రాలు మే 28న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

విష్ణు వర్ధన్​ దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన 'షేర్షా' జులై 2న విడుదలవుతుండగా.. అదే రోజున 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'మేజర్' విడుదల కానుంది. ఇందులో అడవి శేష్​ నటించారు.

వెలుగుల పండగ దీపావళికి అక్షయ్‌కుమార్‌ 'పృథ్వీరాజ్‌'(నవంబరు 5), షాహిద్‌ కపూర్‌ 'జెర్సీ'(నవంబరు 5) రిలీజ్​ కానున్నాయి.

ఇదీ చూడండి: బాక్సాఫీస్​ వార్: సల్మాన్​తో జాన్​, ఆర్​ఆర్​ఆర్​తో మైదాన్​

Last Updated :Feb 24, 2021, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.