ETV Bharat / sitara

'ప్రపంచంలో రష్మిక కంటే అందగత్తె ఎవరు?'

author img

By

Published : May 22, 2020, 7:44 AM IST

నటి రష్మికకు తన పేరు మార్చుకుంటే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిందట. తనకు ఏ పేరు సరిపోతుందో సూచించండి అంటూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులను అడిగింది. దీనిపై స్పందించిన పలువురు నెటిజన్లు కొన్ని పేర్లును ఆమెకు తెలిపారు.

Actress Rashmika Wants to change her Name!
'ప్రపంచంలో రష్మిక కంటే అందగత్తె ఎవరు?'

వరుస విజయాలతో జోరుమీదున్న నాయిక రష్మిక.. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి 'పుష్ప'లో నటిస్తోంది. అయితే తన పేరుని మార్చుకుంటే ఎలా ఉంటుంది? అనే ఓ సరదా ఆలోచన రష్మిక మదిలో మెదిలింది. ఇదే ప్రశ్న ట్విటర్‌లో అభిమానుల్ని అడిగింది. వాళ్లూ అంతే ఫన్నీగా సమాధానాలు చెప్పారు. లిల్లీ, పూజ, తలా రష్మిక, పింకీ, ఎనర్జీ, హనీ, శాన్వి..ఇలా అభిమానులు రకరకాలుగా పేర్లు సూచించారు. ఓ అభిమాని "మోనాలిసాలా ప్రపంచంలో మీకంటే అందగత్తె ఎవరు? పైగా మీ ముద్దు పేరు మోనీ కాబట్టి మోనాలిసా అని పెట్టేసుకోండి" అని ట్వీట్‌ చేశాడు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో రష్మిక నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో నితిన్​ హీరోగా తెరకెక్కిన 'భీష్మ' చిత్రంతో మెప్పించింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ కథానాయకుడిగా రానున్న 'పుష్ప' చిత్రంలో ఆమె నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా కొంతకాలంపాటు వాయిదా పడింది.

ఇదీ చూడండి.. రానాకు​ ఎంగేజ్​మెంట్​ కాలేదు.. అది రోకా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.