ETV Bharat / sitara

Movie Updates: మెగాస్టార్ సాంగ్ యూట్యూబ్​లో దూకుడు

author img

By

Published : Jun 27, 2021, 7:01 PM IST

acharya laahe laahe song crosses 60 million views
చిరంజీవి

కొత్త అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆచార్య, 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?, కబ్జా చిత్రాల సంగతులు ఉన్నాయి.

*మెగాస్టార్ 'ఆచార్య' సినిమాలోని 'లాహే లాహే' సాంగ్ యూట్యూబ్​లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే 60 మిలియన్ వ్యూస్ మార్క్​ను ఆదివారం అధిగమించింది. దేవాలయాల నేపథ్య కథతో తీస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్​గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకుడు. అక్టోబరులో థియేటర్లలోకి సినిమా వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' ఆహా ఓటీటీలో సందడి చేయనుంది. జులై 2 నుంచి అందుబాటులోకి రానుంది. పునర్జన్మల నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో 'నీలి నీలి ఆకాశం' పాట అయితే ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉంది.

30 rojullo preminchadam ela movie
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? మూవీ

*ఉపేంద్ర హీరోగా నటిస్తున్న బహుభాషా చిత్రం 'కబ్జా'. ఇందులో సుదీప్​ కూడా కీలకపాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరూ కలిసున్న లుక్​ను తాజా విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

kabza movie
కబ్జా మూవీ కొత్త లుక్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.