ETV Bharat / science-and-technology

వాట్సాప్ స్టేటస్​ ఇక ఇన్​స్టాలోనూ షేరింగ్- మెటా నయా ఫీచర్

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 6:27 PM IST

Status Update Features Of Whatsapp
Status Update Features Of Whatsapp

Whatsapp Status Update On Instagram : వాట్సాప్ యూజర్లకు గుడ్​న్యూస్. వాట్సాప్​ద్వారా తమ స్టేటస్​లను నేరుగా ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసుకునేందుకు వీలుగా మెటా కొత్త ఫీచర్​ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్​ గురించి తెలుసుకుందామా మరి.

Whatsapp Status Update On Instagram : ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్​ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ల మాతృసంస్థ అయిన మెటా తమ యూజర్ల కోసం మరో అప్​డేట్ తీసుకురానునుంది. వాట్సాప్​ యూజర్లు వారి స్టేటస్​ అప్​డేట్లను నేరుగా ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసుకోవడానికి వీలుగా ఫీచర్​ తీసుకువచ్చేందుకు మెటా సంస్థ పనిచేస్తున్నట్లుగా తెలిసింది.

ప్రస్తుతం వాట్సాప్ వినియోగదారులు ఇప్పటికే వారి స్టేటస్​ అప్​డేట్​లను నేరుగా ఫేస్​బుక్ స్టోరీస్​కు షేర్​చేసే ఫీచర్​ ఇప్పటికే అందుబాటులో ఉంది. తాజాగా మెటా అభివృద్ధి పరుస్తున్న ఫీచర్​ ఇన్​స్టాగ్రామ్​కు విస్తరింప చేస్తుంది. తద్వారా యూజర్స్​ ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​ ఏకకాలంలో రెండు సోషల్​ మీడియా ఫ్లాట్​ఫామ్​ల్లో వారి స్టేటస్​ను షేర్​ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదికల ప్రకారం మెటా ఈ ఫీచర్లును మొదట ఆండ్రాయిడ్ బీటాయూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఈ ఫీచర్లను ఎప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. ఏ సమయంలోనైనా అందరూ ఉపయోగించే విధంగా తీసుకువచ్చే అవకాశం ఉందని ఆ నివేదిక తెలిపింది.

అయితే మెటా అందుబాటులోకి తీసుకురానున్న ఈ ఫీచర్లు ఉపయోగించాలా వద్దా అనే విషయంపై యూజర్లు నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించింది. వాట్సాప్ నుంచి నేరుగా షేర్​ చేయడం వల్ల సమయం అవుతుంది. దీంతో పాటు మరింత సమర్థవంతమైన క్రాస్​-ప్లాట్​ఫామ్​ షేరింగ్ ప్రక్రియ ఉంది. అయితే ఫొటో, వీడియో ఎడిటింగ్ ఫీచర్లను ఎక్కువ మంది యూజర్లు ఇష్టపడుతుంటారు. నేరుగా వాట్సాప్​ నుంచి స్టోరీస్​ను షేర్​ చేసినప్పుడు కొన్ని ఫీచర్లను మిస్​ అవుతున్నట్లుగా తెలిసింది. ఈ విషయాన్ని నివేదిక తెలిపింది.

మరోవైపు వాట్సాప్ ఇటీవల ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్​ ఛాట్ ఫీచర్లును ప్రవేశపెట్టింది. ఇది ఏఐ ఆధారిత చాట్​బాట్​లతో పరస్పరం చాట్​ చేయడానికి వినియోగదారులను అవకాశం కల్పిస్తుంది. మెటా ఏఐ ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్​ను ఈ ఏడాది సెప్టెంబర్​లోనే మార్క్​ జుకర్​బర్గ్​ ఆవిష్కరించారు. తమ వినియోగదారులు మరింత వేగంగా చాట్ చేసేందుకు అవకాశం కల్పిచేందుకే ఈ ఫీచర్​ను తీసుకువచ్చింది మెటా.

మీ ప్రైవేట్ చాట్స్ ఎవరూ చూడకూడదా? సింపుల్​గా 'సీక్రెట్ కోడ్' పెట్టేయండిలా!

వాట్సాప్ మరో నయా ఫీచర్​- ఒకే నంబర్​పై రెండు అకౌంట్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.