ETV Bharat / science-and-technology

వాట్సాప్ మరో నయా ఫీచర్​- ఒకే నంబర్​పై రెండు అకౌంట్స్

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 9:42 AM IST

Two Whatsapp Accounts In One Mobile : ప్రస్తుత కాలంలో దాదాపు అందరికీ వాట్సాప్ అకౌంట్లు ఉన్నాయి. గతంలో ఒక ఫోన్​లో ఒకటే వాట్సాప్ అకౌంట్ వాడుకునే వీలుండేది. కానీ ప్రస్తుతం ఒకే ఫోన్​లో రెండు అకౌంట్లు యూజ్ చేసుకునే సౌకర్యాన్ని ఆ కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేలాగంటే..

Two Whatsapp Accounts In One Mobile
ఒకే ఫోన్​లో రెండు వాట్సాప్​లు ఉపయోగించడం ఎలా

Two Whatsapp Accounts In One Mobile : గతంలో ఒక ఫోన్​లో ఒకటే వాట్సాప్ వినియోగించుకునే అవకాశముండేది. కానీ వాట్సాప్ మాతృ సంస్థ అయిన మెటా వినియోగదారుల కోసం ఒకే డివైజ్​లో రెండు వాట్సాప్ ఖాతాల్ని ఉపయోగించుకునే ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల ఒకే ఫోన్లో రెండు అకౌంట్లకు స్విచ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. మన కాంటాక్ట్స్​ని సింక్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్లు కూడా వేర్వేరుగా వస్తాయి.

ఫీచర్లు ఇవే!
ఒకే ఫోన్​లో రెండు వాట్సప్ ఖాతాలను ఉపయోగించడం అనేది చాలా మందికి కావాల్సిన ఫీచర్. దీనితో ఇప్పటికే ఉన్న ఖాతాకు మరో నంబరుని జోడించవచ్చు. ఇంకో ఫోన్​లో మరో అకౌంట్ ఉపయోగిస్తే.. ఆ ఫోన్ అవసరం లేకుండా.. దాన్ని కూడా ఒకే డివైజ్​లో యూజ్ చేయవచ్చు. వాట్సప్​లో రెండో అకౌంట్ పెట్టుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది మన వ్యక్తిగత అకౌంట్, బిజినెస్ అకౌంట్​ను వేరు పరుస్తుంది. మరి కొందరికి వారి చాట్స్​ను సీక్రెట్​గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

ఒకే ఫోన్​లో రెండో వాట్సాప్ అకౌంట్​ను యూజ్ చేయడానికి..
యాప్ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపున పైనున్న 3 చుక్కలు ప్రెస్ చేసి సెట్టింగ్​ను ఎంచుకోవాలి. అక్కడ మీ ప్రొఫైల్ పిక్, పేరు పక్కన క్యూఆర్ కోడ్ కనబడుతుంది. దాని పక్కనే ఒక ఆరో మార్క్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే.. యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మీ రెండో అకౌంట్​ను యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ మొదటి సారి వాట్సాప్ అకౌంట్​ను సైన్ అప్ చేసేటప్పటిలాగే ఉంటుంది. మీ ఫోన్​లో రెండో ఖాతాను జోడించిన తర్వాత.. ప్రతి ఖాతాకు సంబంధించిన చాట్స్, అప్ డేట్స్, కమ్యూనిటీస్, కాల్స్ యాక్సెస్ కోసం రెండింటి మధ్య స్వాప్ చేయాల్సి ఉంటుంది.

అకౌంట్స్​ను ఎలా స్వాప్ చేయాలి ?
వాట్సాప్ ఖాతాల మధ్య స్వాపింగ్ చేయడం చాలా సులభం. దీనికోసం మెనూలోని 3 డాట్స్ పై ప్రెస్ చేస్తే అక్కడ స్విచ్ అకౌంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇలా కాకుండా మరో దారి ఏంటంటే.. మెనూ తర్వాత సెట్టింగ్స్​ను ఎంచుకుని అక్కడున్న బాణం గుర్తుపై ప్రెస్ చేయాలి. తర్వాత అక్కడ రెండు అకౌంట్లు కనిపిస్తాయి. కావాల్సిన దానికి చేంజ్ అవ్వొచ్చు. గతంలో లాగా రెండో అకౌంట్ వాడాటానికి రెండో ఫోన్ అవసరం లేదు. పైగా అవి ఒకే ఫోన్​లో ఉండటం వల్ల మీరు ఎప్పుడంటే అప్పుడు వాటిని వాడుకునే సౌలభ్యం ఉంటుంది.

WhatsApp Dual Account Feature : ఒకే ఫోన్​లో రెండు వాట్సాప్‌ ఖాతాలు​.. ఎలా క్రియేట్​ చేయాలంటే?

మీ ​ఫోన్​లో QR స్కానర్ పనిచేయట్లేదా? సింపుల్ ట్రిక్స్​​తో సెట్​ చేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.