ETV Bharat / science-and-technology

రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు- ప్లాన్లు ఇవే...

author img

By

Published : Mar 5, 2021, 12:52 PM IST

దేశవ్యాప్తంగా 4 వేలకుపైగా రైల్వే స్టేషన్లలో పెయిట్​ వైఫై సేవలు ప్రారంభించింది రైల్​టెల్​. సాధారణ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని నామమాత్రపు ధరలకే ఈ సేవలు అందిస్తున్నట్లు తెలిపింది. మరి ప్రీ పెయిడ్​ వైఫై సేవలు పొందటం ఎలా? ఇప్పటికే ఉన్న ఉచిత వైఫై సేవలు కొనసాగుతాయా? అనే వివరాలు మీ కోసం.

prepaid wi-fi in railway stations
రైల్వేలో ప్రీపెయిడ్​ వైఫై సేవలు

ప్రభుత్వ రంగ సంస్థ రైల్​టెల్​ దేశవ్యాప్తంగా 4 వేల రైల్వే స్టేషన్​లలో ప్రీ పెయిడ్​ వైఫై సేవలను లాంఛనంగా ప్రారభించింది. రైల్వే ప్రయాణికులకు వేగవంతమైన ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ఈ సేవలను తెచ్చినట్లు పేర్కొంది రైల్​టెల్​.

ఉచిత వైఫై సేవలు కొనసాగుతాయా?

దేశవ్యాప్తంగా 5,950 స్టేషన్లలో కొన్నేళ్లుగా ఉచిత వైఫై సేవలు అందిస్తోంది రైల్​టెల్​. స్మార్ట్​ఫోన్ ఉన్న ఎవరైనా ఓటీపీ వెరిఫికేషన్​ ద్వారా ఉచిత ఇంటర్నెట్​ను పొందొచ్చు.

కొత్తగా ప్రీ పెయిడ్​ వైఫై సేవలు ప్రారంభమైన నేపథ్యంలో ఇకపై యూజర్లు 30 నిమిషాల వరకు 1 ఎంబీపీఎస్​ వేగంతో ఉచితంగా ఇంటర్నెట్ వాడుకునేందుకు వీలుంటుంది. హైస్పీడ్​ ఇంటర్నెట్​ కోసం (దాదాపు 34 ఎంబీపీఎస్​) నామమాత్రపు ఛార్జీలు చెల్లించాలి.

రైటల్​టెల్​ ప్రీ పెయిడ్​ వైఫై ప్లాన్లు

ఛార్జీ ప్యాకేజీ గడువు
రూ.10 5 జీబీఒక రోజు
రూ.1510 జీబీఒక రోజు
రూ.20 10 జీబీ 5 రోజులు
రూ.3020 జీబీ 5 రోజులు
రూ.40 20 జీబీ10 రోజులు
రూ.5030 జీబీ 10 రోజులు
రూ.7060 జీబీ30 రోజులు

మరిన్ని వివరాలు..

నెట్​ బ్యాంకింగ్, క్రిడిట్​, డెబిట్​ కార్డుల ద్వారా ఈ ప్యాకేజీలు కొనుగోలు చేయొచ్చు.

కొత్త ప్లాన్లతో ఏడాదికి రూ.10-15 కోట్ల ఆదాయం గడించాలని రైల్​టెల్ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఈ సేవలు బాగా ఉపయోగపడతాయని భావిస్తోంది.

ఇదీ చూడండి:ఒపెక్​ దేశాల నిర్ణయంతో పెరగనున్న పెట్రో ధరలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.