ETV Bharat / science-and-technology

ఆరు మోడళ్లతో అదరగొట్టిన నోకియా

author img

By

Published : Apr 9, 2021, 2:55 PM IST

స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ నోకియా మార్కెట్లోకి సరికొత్త మోడళ్లు తీసుకువచ్చింది. వీటిలో రెండు మోడళ్లు 5జీ టెక్నాలజీని సపోర్ట్​ చేయనున్నాయి. వాటి ఫీచర్లు, ధరలు ఓ సారి చూద్దాం.

Nokia C10, Nokia C20, Nokia G10, Nokia G20, Nokia X10, and Nokia X20 were launched on Thursday at a virtual launch
నోకియా సరికొత్తగా మూడు సిరీస్​లు, ఆరు మోడళ్లో ఫోన్లు

హెచ్‌ఎండీ గ్లోబల్ ఆరు సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని మూడు సిరీస్​లలో ఆరు మోడల్స్​లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి పేర్లు నోకియా సీ10, నోకియా సీ20, నోకియా జీ10, నోకియా 20,నోకియా ఎక్స్​10, నోకియా ఎక్స్​ 20. వీటిలో రెండు వేరయంట్లు 5జీ టెక్నాలజీని సపోర్టు చేయనున్నాయి. ఈ మోడల్స్‌ అందరికీ అందుబాటులో ఉండేలా ధరలను నిర్ణయించింది కంపెనీ.

వీటితో పాటు నోకియా పవర్‌ ఇయర్‌బడ్స్ లైట్‌ను కూడా విడుదల చేసింది.

నోకీయా సీ10

నోకియా సీ10 ప్రారంభ ధర సుమారు రూ. 7వేలు ఉండొచ్చని అంచనా. 1జీబీ+16జీబీ, 1జీబీ+32జీబీ,2జీబీ+16జీబీ ఇలా మొత్తం మూడు వేరియింట్లు బడ్జెట్​లో వివిధ ధరల్లో ఉండనున్నాయి. ఈ ఫోన్లు కేవలం కొన్ని మార్కెట్లలోనే జూన్​ నుంచి అందుబాటులోకి రానున్నాయి.

Nokia C10, Nokia C20, Nokia G10, Nokia G20, Nokia X10, and Nokia X20 were launched on Thursday at a virtual launch
నోకియా సీ 10

ఫీచర్లు ఇవే..

  • గ్రే, లైట్​ పర్పుల్​ కలర్లలో లభ్యం.
  • ఆండ్రాయిడ్​ 11
  • 6.51 అంగుళాల హెచ్​డీ డిస్​ప్లే
  • 2డీ పాండా గ్లాస్ ప్రొటెక్షన్​
  • 2జీబీ ర్యామ్​, 256జీబీ వరకు స్టోరేజ్
  • 5ఎంపీ బ్యాక్​, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • ఎఫ్​ఎం రేడియో

నోకియా సీ20

నోకియా సీ20 ప్రారంభ ధర సుమారు రూ. 7,900 ఉండొచ్చని అంచనా. 1జీబీ+16జీబీ, 2జీబీ+32జీబీ ఇలా రెండు వేరియింట్లు బడ్జెట్​ ధరల్లో లభించనున్నాయి. ఈ ఫోన్లు కేవలం కొన్ని మార్కెట్లలోనే జూన్​ నుంచి అందుబాటులోకి రానున్నాయి.

Nokia C10, Nokia C20, Nokia G10, Nokia G20, Nokia X10, and Nokia X20 were launched on Thursday at a virtual launch
నోకియా సీ20

సీ20 ఫీచర్లు

  • డార్క్​ బ్లూ, సాండ్​ కలర్లలో లభ్యం
  • ఆండ్రాయిడ్​ 11
  • 6.51 అంగుళాల హెచ్​డీ డిస్​ప్లే
  • 2డీ పాండా గ్లాస్ ప్రొటెక్షన్​
  • 2జీబీ ర్యామ్​, 256జీబీ వరకు స్టోరేజ్
  • 5ఎంపీ బ్యాక్​, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • ఎఫ్​ఎం రేడియో
  • హెచ్​డీఆర్​ సపోర్టెడ్​ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​

నోకియా జీ10

నోకియా జీ10 ప్రారంభ ధర సుమారు రూ. 12,300 ఉంటుందని అంచనా. 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ ఇలా రెండు వేరియింట్లు సరసమైన ధరల్లో ఉండనున్నాయి. ఈ ఫోన్లు కేవలం కొన్ని మార్కెట్లలోనే ఏప్రిల్​ నుంచి అందుబాటులోకి రానున్నాయి.

Nokia C10, Nokia C20, Nokia G10, Nokia G20, Nokia X10, and Nokia X20 were launched on Thursday at a virtual launch
నోకియాా జీ10

ఫీచర్లు..

  • ఆండ్రాయిడ్​ 11
  • 6.5 అంగుళాల హెచ్​డీ గ్లాస్​
  • 4జీబీ ర్యామ్​, 512 జీబీ వరకు స్టోరేజ్
  • 13ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ సెల్ఫీ కెమెరా
  • డస్క్​, నైట్​ షేడ్స్​లో లభ్యం
  • ఫింగర్​ ప్రింట్​ సెన్సార్​
  • 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ

నోకియా జీ20

నోకియా జీ20 ప్రారంభ ధర సుమారు రూ. 14,000 ఉంటుందని అంచనా. 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ ఇలా రెండు వేరియింట్లు లభించనున్నాయి. ఈ ఫోన్లు కేవలం కొన్ని మార్కెట్లలోనే మే నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి.

Nokia C10, Nokia C20, Nokia G10, Nokia G20, Nokia X10, and Nokia X20 were launched on Thursday at a virtual launch
నోకియా జీ20

ఫీచర్లు..

  • ఆండ్రాయిడ్​ 11
  • 6.5 అంగుళాల డిస్​ప్లే
  • 48ఎంపీ+5ఎంపీ+2ఎంపీ+8ఎంపీ కెమెరా
  • 4జీ ఎల్​టీఈ కనెక్టివిటీ
  • గ్లాసియర్​, నైట్​ కలర్స్​లలో లభ్యం

నోకియా ఎక్స్​10

నోకియా ఎక్స్​10 ప్రారంభ ధర సుమారు రూ. 27,400గా ఉండనుంది. 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ,4జీబీ+128జీబీ ఇలా మొత్తం మూడు వేరియింట్లలో ఉండనుంది. జూన్​ నుంచి ఈ ఫోన్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Nokia C10, Nokia C20, Nokia G10, Nokia G20, Nokia X10, and Nokia X20 were launched on Thursday at a virtual launch
నోకియా ఎక్స్ 10

ఫీచర్లు..

  • ఆండ్రాయిడ్​ 11
  • 6.67 అంగుళాల ఫుల్ హెచ్​డీ డిస్​ప్లే
  • ఆక్టోకోర్​ క్వాల్​కమ్​ స్నాప్​డ్రాగన్​ 480 పై పని చేస్తుంది
  • 48ఎంపీ+5ఎంపీ+2ఎంపీ+2ఎంపీ కెమెరాలు
  • 8ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 5జీ సపోర్ట్​ ఫోన్​
  • వాటర్​ రెసిస్టెంట్​
  • 4,470 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 18 వాట్​ల ఫాస్ట్​ ఛార్జింగ్​
  • ఫారెస్ట్​, స్నో కలర్స్​లో లభ్యం
  • లైట్​ వెయిట్​ ఫోన్​, 210 గ్రాములు

నోకియా ఎక్స్​20

నోకియా ఎక్స్​20 ప్రారంభ ధర సుమారు రూ. 31,000గా ఉండనుంది. 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ ఇలా మొత్తం రెండు వేరియింట్లలో ఉండనుంది. మే నెల నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Nokia C10, Nokia C20, Nokia G10, Nokia G20, Nokia X10, and Nokia X20 were launched on Thursday at a virtual launch
నోకియా ఎక్స్​ 20

ఫీచర్లు..

  • డ్యూయల్​ సిమ్​
  • ఆండ్రాయిడ్​ 11
  • 6.67 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లే
  • ఆక్టోకోర్​ క్వాల్​కమ్​ స్నాప్​డ్రాగన్​ 480 పై పని చేస్తుంది
  • 64ఎంపీ+5ఎంపీ+2ఎంపీ+2ఎంపీ కెమెరాలు
  • 32ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 5జీ టెక్నాలజీ
  • ఫింగర్​ప్రింట్​
  • 18 వాట్​ల ఫాస్ట్​ ఛార్జింగ్​
  • నూర్డిక్​ బ్లూ, సన్​ రంగుల్లో లభ్యం కానున్నాయి.

నోకియా ఇయర్​ బడ్స్​

హెచ్​ఎండీ గ్లోబల్​ ఈ స్మార్ట్​ఫోన్లతో పాటు ఇయర్​ బడ్స్​ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని మార్కెట్లలో గురువారం నుంచి వీటి అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. వీటి ధర సుమారు రూ. 3,500 వరకు ఉంటుంది అని టెక్​ నిపుణులు అంచనా వేస్తున్నారు. 36 గంటల పాటు నిరంతరాయంగా పని చేయగల సామర్థ్యం వీటి సొంతం. ఇవి చార్కోల్​, పోలార్​ సీ రంగుల్లో లభ్యం కానున్నాయి.

ఇదీ చూడండి: మార్కెట్లోకి నోకియా కొత్త ఫోన్లు.. ఫీచర్లు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.