ETV Bharat / science-and-technology

లింక్డ్​ఇన్​లో జాబ్ ఆఫరా? తస్మాత్ జాగ్రత్త!

author img

By

Published : Apr 7, 2021, 8:41 PM IST

Updated : Apr 7, 2021, 10:31 PM IST

సైబర్​ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. లింక్డ్​ఇన్​లో ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారే లక్ష్యంగా.. సైబర్​ మోసాలకు పాల్పడుతున్నారు. దీనిపై 'ఈ సెన్​టైర్' అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ లింక్డ్​ఇన్ మోసాలు ఎలా జరుగుతున్నాయి? వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలంటే ఎలా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Beware of Frauds in LinkedIn
లింక్డ్​ఇన్​లో ఉద్యోగార్థులే లక్ష్యంగా సైబర్ దాడులు

కరోనాతో ఆదాయాలు పడిపోవడం వల్ల.. చాలా సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకున్నాయి. ఇలా గత ఏడాది నుంచి చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వారంతా కొత్త ఉపాధి వెతుక్కునే పనిలో పడ్డారు. అయితే.. ఇప్పటికే ఉపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగార్థులను ఆశపెట్టి దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ముఖ్యంగా లింక్డ్​ఇన్​లో ఉద్యోగ వేటలో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

హ్యాకర్లు కొత్త కొత్త సాంకేతికతతో.. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారిపై సైబర్ దాడులు చేస్తున్నట్లు 'ఈ సెన్​టైర్​' అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ నివేదిక పేర్కొంది. నకలీ జాబ్ ఆఫర్లను ఎరగా వేసి.. యూజర్ల డివైజ్​లలోకి రిమోట్​కోడ్​ మాల్​వేర్​ను పంపిస్తున్నట్లు తెలిపింది. ఈ మాల్​వేర్ చొప్పించి.. యూజర్ల డివైజ్​ను హ్యాకర్లు పూర్తిగా నియంత్రించగలుగుతున్నట్లు వివరించింది.

ఎలా జరుగుతుందంటే?

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి నేరుగా జాబ్ ఆఫర్​ సందేశం పంపించి.. సైబర్​ మోసగాళ్లు​ హ్యాకింగ్​కు పాల్పడుతున్నట్లు నివేదిక వివరించింది. జిప్ ఫైళ్ల రూపంలో జాబ్​ ఆఫర్​ అటాచ్​మెంట్​ను పంపి.. అందులో గుర్తించని విధంగా మాల్​వేర్​ను ఉంచుతున్నారని తెలిపింది.

ఎవరైతే ఆ ఫైళ్లు నిజమైన ఉద్యోగానికి సంబంధించినవే అని నమ్మి, డౌన్​లోడ్​ చేసుకుంటున్నారో.. వారికి తెలియకుండానే డివైజ్​లోకి మాల్​వేర్ చేరుతున్నట్లు 'ఈ సెన్​టైర్' నివేదిక​ పేర్కొంది.

ఎలా జాగ్రత్త పడాలి..

లింక్డ్​ఇన్​లో మీరు ఎదురు చూస్తున్న ఉద్యోగానికి సంబంధించి.. జిప్​ ఫైళ్ల​ రూపంలో ఏదైనా ఆఫర్ వస్తే ఆ ఫైల్​​ను డౌన్​లోడ్​ చేయకుండా.. ముందు పలు విషయాలను పరిశీలించాలని చెబుతున్నారు సైబర్ నిపుణులు. ముఖ్యంగా మీకు వచ్చే జిప్​ ఫైల్​​ పేరులో గుర్తు తెలియని పదాలు, స్పెల్లింగ్ మిస్టెక్స్, ఫైల్ పేరులో అదనపు పదాలు ఉంటే వాటిని నకిలీ జాబ్​ ఆఫర్లుగా అనుమానించాలని చెబుతున్నారు.

ఉదారణకు మీరు సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లైతే.. సీనియర్ అకౌంటెంట్ పొజిషన్ (పొజిషన్ అనే పదం అదనంగా ఉంది) అనే పేరుతో జిప్​ ఫైల్​ వస్తే అది మోసపూరితమైన ఆఫర్​గా గుర్తించాలని సూచిస్తున్నారు నిపుణులు.

నకిలీ అయినప్పటికీ కొన్ని ఆఫర్లు నిజమైన వాటిలానే కనిపిస్తాయని అలాంటి వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు సైబర్ నిపుణులు.

ఈ విషయంపై స్పందించిన లింక్డ్​ఇన్ తమ ప్లాట్​ఫామ్​లో మోసాలకు తావివ్వకుండా.. ఆటోమెటిక్​, మాన్యువల్​గా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఏవైనా ఖాతాలు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వాటిని తొలగిస్తున్నట్లు కూడా తెలిపింది.

ఇదీ చదవండి:గూగుల్​లో వెతుకులాటకు కొత్త ఫీచర్లు!

Last Updated :Apr 7, 2021, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.