ETV Bharat / science-and-technology

ట్రైన్ ట్రాకింగ్ & లైవ్​ వ్యూ వాకింగ్ - గూగుల్ మ్యాప్స్ నయా ఫీచర్స్!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 1:27 PM IST

Google Maps Upcoming Features For Indian Users In Telugu : టెక్​ దిగ్గజం గూగుల్ త్వరలో​ ఇండియన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా వివిధ గూగుల్ మ్యాప్స్​ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా వేర్​ ఈజ్​ మై ట్రైన్​, ఫ్యూయెల్​ ఎఫీషియంట్​ రూటింగ్​, లైవ్​ వ్యూ వాకింగ్​, లెన్స్ ఇన్ మ్యాప్స్​ లాంటి అనేక ఫీచర్లను భారత్​లో ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది.

Building for India Google event
Google Maps upcoming features for Indian users

Google Maps Upcoming Features For Indian Users : దిగ్గజ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ గూగుల్, భారతీయ యూజర్ల కోసం ప్రత్యేకంగా అనేక గూగుల్​ మ్యాప్స్​ ఫీచర్లను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. దిల్లీలో జరిగిన 'బిల్డింగ్​ ఫర్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా, త్వరలో లైవ్ వ్యూ వాకింగ్​, లెన్స్​ ఇన్​ మ్యాప్స్ సహా, ఫ్యూయెల్ ఎఫీషింట్ రూటింగ్​, అడ్రస్​ డిస్క్రిప్టర్స్​, వేర్​ ఈజ్ మై ట్రైన్​ లాంటి ఫీచర్లను భారత్​లో ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది.

ఆండ్రాయిడ్​ యూజర్లకే ఫస్ట్​ ఛాన్స్​!
ఈ నయా గూగుల్ మ్యాప్స్​ ఫీచర్లు మొదటిగా ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తాయి. తరువాత వాటిని ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి తేనున్నారు.

టాప్​ ఫీచర్స్​
Google Maps Features :

  1. వేర్ ఈజ్​ మై ట్రైన్ ఫీచర్​ : గూగుల్ మ్యాప్స్​ రైలు ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా వేర్​ ఈజ్​ మై ట్రైన్ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా మన ట్రైన్ ఎక్కడుందో సులువుగా తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్​ ముంబయి, కోల్​కతా లోకల్​ ట్రైన్స్​ గురించి మాత్రమే తెలియజేస్తుంది. ఈ ఫీచర్​ను 2024 ప్రథమార్థంలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
  2. అడ్రస్​ డిస్క్రిప్టర్స్ : గూగుల్ మ్యాప్స్​కు 2024 మొదట్లోనే ఈ అడ్రస్​ డిస్క్రిప్టర్స్​ ఫీచర్​ను అనుసంధానం చేసే అవకాశం ఉంది.
  3. లైవ్​ వ్యూ వాకింగ్ ఫీచర్ : భారతదేశంలోని 3000 నగరాల్లో ఈ ఫీచర్​ అందుబాటులోకి రానుంది. ఆ తరువాత ఐఓఎస్​ డివైజ్​లకు కూడా దీనిని అందుబాటులోకి తేనున్నారు.
  4. ఫ్యూయెల్ ఎఫీషియంట్ రూటింగ్​ : 2024 జనవరిలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా పచ్చని ఆకు గుర్తు ఉన్న ఎకో-ఫ్రెండ్లీ రూట్​లను మనం తెలుసుకోవచ్చు. మొదటిగా 20 ప్రధాన నగరాల్లో ఈ ఫీచర్​ను ప్రవేశపెట్టనున్నారు.
  5. లెన్స్ ఇన్​ మ్యాప్స్​ : ఈ ఫీచర్​ను కూడా 2024 జనవరిలోనే తీసుకురానున్నారు. ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తే, మీ ఫోన్​ కెమెరా ఉపయోగించి, స్థానిక సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. ​

భారతదేశంలోని వివిధ రీజియన్లకు, అక్కడి యూజర్ల అవసరాలకు తగినట్లుగా మంచి యూజర్ ఎక్స్​పీరియన్స్ ఇవ్వడమే లక్ష్యంగా గూగుల్ మ్యాప్స్​లో ఈ సరికొత్త ఫీచర్లను తేవడానికి సన్నాహాలు చేస్తోంది గూగుల్​.

Google Maps Fuel Saving Feature : గూగుల్ మ్యాప్స్ భారతదేశంలో తాజాగా 'ఫ్యూయెల్​ సేవింగ్' ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. వాహనదారులు ఇంధనాన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే, గూగుల్​ మ్యాప్స్​లో ఈ ఫ్యూయెల్ సేవింగ్ ఫీచర్​ను ఎనేబుల్​ చేసుకోవాలి. అప్పుడు మీ వాహనంలో ఉన్న ఇంజిన్ రకం ఆధారంగా, వివిధ మార్గాల్లో ప్రయాణిస్తే ఎంత ఇంధనం లేదా శక్తి వినియోగం అవుతుందో గూగుల్ మ్యాప్స్ లెక్కవేస్తుంది. ఏ మార్గంలో ప్రయాణిస్తే, తక్కువ ఇంధనం ఖర్చు అవుతుందో సూచిస్తుంది. దీని వల్ల మీకు ఆర్థికంగా లాభం కలుగుతుంది. పైగా పర్యావరణానికి కూడా హితం కలుగుతుంది.

మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా? రూ.30వేలు బడ్జెట్లోని టాప్​-10 మొబైల్స్ ఇవే!

రూ.30 వేలు బడ్జెట్లో మంచి ల్యాప్​టాప్​ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్​ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.