ETV Bharat / science-and-technology

అమెజాన్​ ప్రైమ్​ Lite​ ప్లాన్​పై భారీ డిస్కౌంట్​ - మిగిలిన కంపెనీల ప్లాన్స్​ ఎలా ఉన్నాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 3:53 PM IST

best ott platforms in india 2023
best ott plans in india 2023

Best OTT Plans In India 2023 : మీరు ఓటీటీ లవర్సా? లేటెస్ట్ సినిమాలు, వెబ్​సిరీస్​లు, లైవ్ స్పోర్ట్స్​ చూడడానికి ఇష్టపడతారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం ఈ కామర్స్​ దిగ్గజం అమెజాన్​ - ప్రైమ్​ లైట్​ ప్లాన్​ ధరను ఏకంగా రూ.200 వరకు తగ్గించింది. అలాగే పలు ఇతర ఓటీటీ ప్లాట్​ఫామ్​లు కూడా తమ యూజర్ల కోసం మంచి ప్లాన్స్ అందిస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Best OTT Plans In India 2023 : ఓటీటీ లవర్స్​ అందరికీ గుడ్ న్యూస్​. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్స్ అన్నీ తమ యూజర్ల కోసం అద్భుతమైన ప్రీమియం ప్లాన్స్ అందిస్తున్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ ఆఫర్స్, డిస్కౌంట్స్​ ఇస్తున్నాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Amazon Prime Plans : ఈ కామర్స్​ దిగ్గజం అమెజాన్​ 4 రకాల ప్రైమ్ మెంబర్​షిప్ ప్లాన్​లను అందిస్తోంది. అవి:

  1. మంత్లీ ప్రైమ్​ ప్లాన్​ (1 నెల) - రూ.299
  2. క్వార్టర్లీ ప్రైమ్​ ప్లాన్​ (3 నెలలు) - రూ.599
  3. యాన్యువల్ ప్రైమ్​​ ప్లాన్ (12 నెలలు) - రూ.1499
  4. యాన్యువల్​ ప్రైమ్ లైట్​ ప్లాన్ (12 నెలలు) - రూ.799

Amazon Prime Lite Membership Plan Price : అమెజాన్ తాజాగా​ ప్రైమ్​ లైట్​ మెంబర్​షిప్​ ప్లాన్ ధరను ఏకంగా రూ.200 వరకు తగ్గించింది. దీనితో రూ.999 విలువైన అమెజాన్​ ప్రైమ్ లైట్​ సబ్​స్క్రిప్షన్ ఇప్పుడు కేవలం రూ.799కే లభిస్తోంది.

Amazon Prime Lite Benefits : అమెజాన్ ప్రైమ్​ లైట్​ మెంబర్​షిప్ ఉన్న వారికి పలు బెనిఫిట్స్​ లభిస్తాయి. అవి:

  • యూజర్లకు టు-డే డెలివరీ, షెడ్యూల్డ్​ డెలివరీ, సేమ్​-డే డెలివరీ లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి.
  • నో-కాస్ట్ ఈఎంఐ, మార్నింగ్ డెలివరీ (ఒక ఐటెమ్​కు రూ.175 ఛార్జీ), 6 నెలల వరకు ఫ్రీ స్క్రీన్ రీప్లేస్​మెంట్​ లాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
  • అన్​లిమిటెడ్​ హెచ్​డీ మూవీస్​, అమెజాన్ ఒరిజినల్స్​, లైవ్​ స్పోర్ట్స్​, టీవీ షోలు చూడవచ్చు.
  • అమెజాన్​ డీల్స్​, ఆఫర్స్​ కూడా పొందవచ్చు.

Amazon Prime Lite Limitations : అమెజాన్ ప్రైమ్ లైట్​ మెంబర్​షిప్​ తీసుకున్నవారికి, ప్రైమ్ మ్యూజిక్​ యాక్సెస్ ఉండదు. అలాగే వీడియో హెచ్​డీ క్వాలిటీకి మాత్రమే పరిమితం అయ్యుంటుంది. గతంలో రెండు డివైజ్​ల్లో ప్రైమ్ లైట్ వాడుకోవడానికి ఉండేది. కానీ ఇప్పుడు కేవలం ఒక డివైజ్​కి మాత్రమే దానిని పరిమితం చేశారు.

సాధారణ ప్రైమ్ మెంబర్​షిప్ ప్లాన్​లతో పోల్చితే, ప్రైమ్ లైట్ ప్లాన్​లో డిస్కౌంటెండ్​ మార్నింగ్​ డెలివరీ (ఐటెమ్​పై రూ.50), అన్​లిమిటెడ్​ ప్రైమ్​ వీడియో డివైజ్​ సపోర్ట్​, 4కె రిజల్యూషన్ సపోర్ట్ ఉండవు.

Netflix Plans : ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫాం నెట్​ఫ్లిక్స్​ 4 రకాల ప్లాన్​లను అందిస్తోంది. అవి :

  1. Netflix Mobile Plan : దీని నెలవారీ చందా రూ.149. ఈ ప్లాన్ తీసుకున్నవారు 480p రిజల్యూషన్​తో ఫోన్, ట్యాబ్లెట్స్​లో వీడియోలను చూడవచ్చు.
  2. Netflix Basic Plan : దీని నెలవారీ చందా రూ.199. ఈ ప్లాన్ తీసుకున్నవారు 720p రిజల్యూషన్​తో ఫోన్, ట్యాబ్లెట్​, కంప్యూటర్​, టీవీల్లో వీడియోలను చూడవచ్చు.
  3. Netflix Standard Plan : దీని నెలవారీ చందా రూ.499. ఈ ప్లాన్ తీసుకున్నవారు 1080p రిజల్యూషన్​తో ఫోన్, ట్యాబ్లెట్​, కంప్యూటర్​, టీవీల్లో నెట్​ఫ్లిక్స్ వీడియో కంటెంట్​ను చూడవచ్చు.
  4. Netflix Premium Plan : ఈ ప్రీమియం ప్లాన్ నెలవారీ చందా రూ.649. ఈ ప్లాన్ తీసుకున్నవారు 4K+HDR రిజల్యూషన్​తో ఫోన్, ట్యాబ్లెట్​, కంప్యూటర్​, టీవీల్లో నెట్​ఫ్లిక్స్ ప్రీమియం కంటెంట్​ను చూడవచ్చు.

Disney Hotstar Plans : డిస్నీ-హాట్​స్టార్​ రెండు రకాల ప్లాన్​లను అందిస్తోంది. అవి:

  1. సూపర్​ ప్లాన్​ : దీని సంవత్సర చందా రూ.899. దీనిలో 1080p ఫుల్​ హెచ్​డీ క్వాలిటీతో వీడియోలు చూడవచ్చు.
  2. ప్రీమియం ప్లాన్​ : దీని సంవత్సర చందా రూ.1499. అయితే రూ.299కే నెలవారీ డిస్నీ హాట్​స్టార్​ ప్రీమియం సబ్​స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. దీనిలో 4కె క్వాలిటీతో మూవీస్​, లైవ్​ స్పోర్ట్స్​, టీవీ షోలు చూడవచ్చు.

ఈ డిస్నీ హాట్​స్టార్ మెంబర్​షిప్ తీసుకున్నవారు, సూపర్​, ప్రీమియం కంటెంట్​ను సెల్​ఫోన్​, టీవీ, ల్యాప్​టాప్​లో చూసుకోవచ్చు.

Aha Plans : ఆహా ఓటీటీ ప్లాట్​ఫాం మొత్తం 5 రకాల ప్లాన్​లను అందిస్తోంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  1. Aha Gold : ఈ ఆహా గోల్డ్ ప్లాన్ సంవత్సర చందా రూ.899. దీనిలో 4కె క్వాలిటీతో, డాల్బీ 5.1 సౌండ్​తో సినిమాలు, వెబ్​సిరీస్​లు చూడవచ్చు.
  2. Telugu Annual Premium : ఈ ఆహా తెలుగు యాన్యువల్​ ప్రీమియం ప్లాన్ సంవత్సర చందా రూ.699. దీనిలో ఫుల్​ హెచ్​డీ (1080p) క్వాలిటీతో కేవలం తెలుగు సినిమాలు, వెబ్​సిరీస్​లు చూడవచ్చు.
  3. Telugu Quarterly Mobile : ఈ ఆహా తెలుగు క్వార్టర్లీ ప్లాన్​ అనేది మొదటిసారి ఆహా ప్లాన్ తీసుకున్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ మూడు నెలల ప్లాన్​ ధర రూ.99 మాత్రమే. దీనిలో 720p రిజల్యూషన్​తో తెలుగు సినిమాలు, వెబ్​సిరీస్​లు చూసుకోవచ్చు.
  4. Telugu Annual : ఈ తెలుగు యాన్యువల్​ ప్లాన్ సంవత్సర చందా రూ.399. దీనిలో ఫుల్​ హెచ్​డీ క్వాలిటీతో, స్టీరియో సౌండ్​ క్వాలిటీతో తెలుగు సినిమాలు, వీడియోలు చూడవచ్చు.
  5. Telugu Quarterly : ఇది ఆహా ప్లాట్​ఫాం అందిస్తున్న వాల్యూ ప్యాక్. ఈ మూడు నెలల ప్లాన్ ధర రూ.199. దీనిలోనూ ఫుల్​ హెచ్​డీ క్వాలిటీతో సినిమాలు, వెబ్​సిరీస్​లు చూడవచ్చు.

ZEE5 Plans : జీ5 ఓటీటీ ప్లాట్​ఫాం 3 రకాల ప్రీమియం ప్లాన్​లను అందిస్తోంది. అవి :

  1. జీ ప్రీమియం హెచ్​డీ (6 నెలల ప్లాన్​) - రూ.599
  2. జీ ప్రీమియం హెచ్​డీ (12 నెలల ప్లాన్​) - రూ.899
  3. జీ ప్రీమియం 4కె (12 నెలల ప్లాన్​) - రూ.1199

ఈ జీ ప్రీమియం ప్లాన్స్ సబ్​స్క్రైబ్ చేసుకున్నవారు ఫోన్​, టీవీ, ల్యాప్​టాప్​ల్లో యాడ్స్ లేకుండా మూవీస్​, వెబ్​సిరీస్​, టీవీ షోస్​, మ్యూజిక్​ అన్నీ ఆస్వాదించవచ్చు.

Jio Cinema Premium Plan : జియో సిమ్ తీసుకున్నవారందరూ, జియో సినిమా ఓటీటీని ఉచితంగా వాడుకోవచ్చు. అయితే ప్రీమియం కంటెంట్ చూడాలంటే మాత్రం, జియో సినిమా ప్రీమియం ప్లాన్​ సబ్​స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని సంవత్సర చందా రూ.999 ఉంటుంది. ఈ ప్రీమియం సబ్​స్క్రిప్షన్ తీసుకున్నవారు ఏ డివైజ్​లో అయినా జియోసినిమా ప్రీమియం కంటెంట్​ను చూడవచ్చు.

ట్రైన్ ట్రాకింగ్ & లైవ్​ వ్యూ వాకింగ్ - గూగుల్ మ్యాప్స్ నయా ఫీచర్స్!

ఫోన్ నంబర్ ఉంటే చాలు - యూజర్ లొకేషన్​ కనిపెట్టేయొచ్చు! గూగుల్ కాంటాక్ట్స్​ నయా ఫీచర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.