ETV Bharat / science-and-technology

కంప్యూటర్ స్పీడ్​ తగ్గుతోందా..? ఈ ఐదు టిప్స్ మీ కోసమే..!

author img

By

Published : Aug 15, 2021, 9:51 AM IST

computer
కంప్యూటర్ స్పీడ్​

కరోనా కారణంగా.. వర్క్‌ ఫ్రమ్‌ హోం, ఆన్‌లైన్‌ క్లాస్‌ల కాలం నడుస్తుంది. చాలా ఇళ్లల్లో ల్యాప్​టాప్, కంప్యూటర్లు దర్శనమిస్తున్నాయి. దీంతో 'మా కంప్యూటర్ స్పీడు తగ్గుతోంది..!' అనే కంప్లైంట్ ఎక్కువగా వినిపిస్తోంది. మీకూ ఇలాంటి సమస్యే ఉందా.. అయితే ఈ స్టోరీ మీకోసమే!

కరోనా మహమ్మారి దృష్ట్యా ప్రస్తుతం చాలా మంది వర్క్​ ఫ్రం హోంలోనే కొనసాగుతున్నారు. విద్యార్థులు కూడా ఆన్​లైన్ క్లాసులకే పరిమితం అవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం చాలా మందికి ఎదురవుతున్న సమస్య..' మా కంప్యూటర్ (లేదా) ల్యాప్​టాప్​ స్పీడ్ తగ్గుతోంది..!' అని. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? చిన్న చిన్న సెట్టింగ్స్​తోనే మీ కంప్యూటర్ స్పీడ్​ను పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

రెగ్యూలర్​గా యాప్స్​..

మన అవసరాల కోసం ఎన్నో యాప్స్​ను కంప్యూటర్​లో ఇన్​స్టాల్ చేసుకుంటాం. మరికొన్ని యాప్స్ మన సిస్టమ్​లో లోడ్​ అయి ఉంటాయి. కంప్యూటర్​ కొన్న కొత్తలో ఉన్న స్పీడ్.. తర్వాత ఉండకపోవటానికి కారణం ఇదే. అందుకే మనం ఇన్​స్టాల్​ చేసుకున్న యాప్స్​ను క్రమం తప్పకుండా సమీక్షించుకోవాలి. ఎప్పుడూ వినియోగించని యాప్స్​ను డిలీట్​ చేయాలి. మీకు కావాలన్నప్పుడు మళ్లీ ఇన్​స్టాల్ చేసుకోవచ్చన్న సంగతి గుర్తుంచుకోండి.

స్టోరేజ్ స్పేస్​పై ఓ కన్నేయండి..

కంప్యూటర్​లో స్టోరేజ్​ స్పేస్​ లేకపోయినా వేగం తగ్గిపోతుంది. వినియోగించని యాప్స్​ను తొలగించటమే కాకుండా.. సిస్టమ్​లో సరిపడా స్టోరేజ్ ఉండేట్టు చూసుకోవాలి. హార్డ్ డ్రైవ్​లో కనీసం 20 శాతం స్టోరేజ్​ స్పేస్ ఉండేలా చూసుకోవటం ఉత్తమం. పాత డాక్యూమెంట్లు, ఫైల్స్​ను క్లౌడ్​లోకి లేదా ఎక్స్​టర్నల్ హార్డ్ డ్రైవ్​లోకి ట్రాన్స్​ఫర్​ చేయాలి. అంతేకాక ఎంతో ముఖ్యమైన ఫైల్స్​ను బ్యాకప్ కింద రెండు కాపీలు పెట్టుకుంటే మంచిది.

డిఫాల్ట్ సెట్టింగ్స్​ను పరిశీలించుకోవాలి..

చాలా యాప్స్​, ప్రోగ్రామ్స్​లో కొన్ని సెట్టింగ్స్​ డిఫాల్ట్​లోకి వెళ్లిపోతుంటాయి. డిఫాల్ట్​లో ఉన్న యాప్స్ మనకు తెలియకుండానే బ్యాక్​గ్రౌండ్​లో రన్ అవుతుంటాయి. దీనివల్ల కంప్యూటర్ స్పీడ్ తగ్గి.. స్లోడౌన్​ సమస్యలు ఎదురవుతాయి. ఇంకొన్ని యాప్స్ పరిధికి మించి ఎక్కువ డేటా, స్పేస్​ను తీసుకుంటాయి. వాటిని వెతికి యాప్​ను క్లీనప్ చేయాలి. అలాంటి యాప్స్​ను సెట్టింగ్స్​లోకి వెళ్లి డిసేబుల్ చేసుకోవాలి.

ఇవీ చదవండి: ఒంటరితనం వల్లే ఇంటర్నెట్‌ అతి వినియోగం!

యాప్స్​ అప్డేట్​ చేయటం..

కంప్యూటర్​లోని యాప్స్​, ప్రోగ్రామ్స్​ను అప్​టూ డేట్ ఉండేలా చెక్​ చేసుకోవాలి. దీనివల్ల ఏమైనా బగ్స్​ ఉంటే ఫిక్స్ అవుతాయి. భద్రత పరమైన ఇబ్బందులూ తలెత్తవు. యాప్స్​ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే.. ఆ యాప్స్ స్పీడ్​గా పనిచేస్తాయి. మన సిస్టమ్​లో చాలా ప్రోగ్రామ్స్​ వాటంతట అవే అప్డేట్ అవుతాయి. కానీ మనం మరోసారి వాటిని చెక్​ చేసుకుంటే బెటర్. పాత వెర్షన్​లు కలిగిన సాఫ్ట్​వేర్​లను కూడా అప్డేట్ చేసుకుంటే మంచిది. అంతేకాక చాలా ఇన్​స్టాలేషన్ ప్యాకేజ్​లను మనం డిలీట్ చేయకుండా వదిలేస్తుంటాం. ఇలాంటి వాటిని డిలీట్ చేయటం వల్ల వెబ్ బ్రౌజింగ్ కూడా స్పీడ్​ అవుతుంది.

ఇవీ చదవండి: ఇంటర్నెట్​ వేగంలో టాప్ 10 దేశాలివే..

ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్​)​ అప్డేట్ చేయాల్సిందే..

ప్రోగ్రామ్స్​, యాప్స్​తోపాటు ఆపరేటింగ్ సిస్టమ్​(ఓఎస్​)నూ అప్డేట్ చేసుకోవాల్సిందే. విండోస్, మ్యాక్​ ఓఎస్ అప్​ టూ డేట్ ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్​ను రెగ్యూలర్​గా రీసెట్టింగ్ చేయాలి. రీసెట్టింగ్ వల్ల సిస్టమ్​ ఉన్నవాటిన్నంటినీ చెరిపస్తుంది. కానీ కొంత ఎక్కువ సమయం తీసుకుంటుంది. డేటా కూడా ఎక్కువగానే ఖర్చవుతుంది.

ఈ ఐదు సూత్రాల ద్వారా మీ కంప్యూటర్ లేదా ల్యాప్​టాప్​ స్పీడ్​ను ఎప్పటికప్పుడు పెంచుకోండి.

ఇవీ చదవండి:

ఈ ఏడు టిప్స్​తో మీ నెట్​ బ్యాంకింగ్ సేఫ్​!

డేటా భద్రత ముఖ్యమా?.. ఈ బ్రౌజర్లు వాడండి!

వర్షం పడినప్పుడు ఇంటర్నెట్ స్పీడ్​ తగ్గిపోతోందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.