ETV Bharat / science-and-technology

ఇంటర్నెట్​ వేగంలో టాప్ 10 దేశాలివే..

author img

By

Published : Jun 13, 2021, 6:00 PM IST

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవల్ని అందించే టాప్ 10 దేశాలెంటో తెలుసా? అక్కడ డేటా స్పీడ్​ 100 నుంచి 200 ఎంబీపీఎస్​ వరకు ఉంటుంది. ఈ జాబితాలో అమెరికా, బ్రిటన్​ వంటి అగ్రదేశాలు లేవు. స్పీడ్​లో కాకపోయినా డేటా ధరలు అత్యంత చౌకగా ఉన్న దేశాల్లో మాత్రం భారత్​ తొలి స్థానంలో నిలిచింది.

ఇంటర్నెట్​ వాడకం విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో డేటా స్పీడ్​కు కూడా ప్రాధాన్యం ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అంతర్జాల సేవల్ని అందిస్తున్న టాప్ 10​ దేశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ జాబితాలో అమెరికా, బ్రిటన్​ వంటి అగ్ర దేశాలు లేకపోవడం గమనార్హం.

10. హంగేరీ..

ఈ దేశంలో 99.74 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్​ సేవల్ని అందిస్తున్నారు. ఈ స్పీడ్​తో హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ 'డేస్​ ఆఫ్ థండర్​'ను కేవలం 43 సెకన్లలో డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

9. మొనాకో

ఇక్కడ సెకనుకు 104.98ఎంబీల వేగంతో ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. ఈ స్పీడ్​తో 'ది సిమ్స్' వీడియో గేమ్​ సిరీస్​ను 142 సెకన్లలోనే డౌన్​లోడ్ చేయొచ్చు.

8. హాంగ్​కాంగ్​

హాంగ్​కాంగ్​లో ఇంటర్నెట్ స్పీడ్​ సెకనుకు 105.32 ఎంబీలు. ఈ వేగంతో బ్యారీ వైట్స్​ గ్రేటెస్ట్ హిట్స్ ఆల్బమ్​ను 0.38 సెకన్​లోనే డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

7. స్విట్జర్లాండ్​

స్విట్జర్లాండ్​లో 110.45 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ఈ స్పీడ్​తో టాప్ గన్ మూవీ డౌన్​లోడ్​ 41 సెకన్లలోనే పూర్తవుతుంది.

6. ఐస్​లాండ్​

ఐస్​లాండ్​లో 116.88 వేగంతో ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నారు. ఈ స్పీడ్​తో హ్యారీ పోటర్ పుస్తకాలన్నింటినీ 12 సెకన్లలోనే డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

5. లక్సంబర్గ్​..

ఈ అతిచిన్న ఐరోపా దేశంలో ఇంటర్నెట్ స్పీడ్​ 118.05 ఎంబీపీఎస్​. ఈ వేగంతో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్​ అన్ని సిరీస్​లను 154 సెకన్లలో డౌన్​లోడ్​ చేయొచ్చు.

4. జిబ్రాల్టర్​

ఇక్కడ 183.09 ఎంబీపీఎస్ వేగంతో అంతర్జాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ స్పీడ్​తో కియాను రీవ్స్ నటించిన స్పీడ్ యాక్షన్​ మూవీని 26 సెకన్లలోనే డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

3. అండోరా

ఈ ఐరోపా దేశంలో ఇంటర్నెట్ వేగం 213.41 ఎంబీపీఎస్​. ఈ హై స్పీడ్​తో లార్డ్ ఆఫ్ రింగ్స్​ సిరీస్​ను 4కే క్వాలిటీతో 130 సెకన్లలోనే డౌన్​లౌడ్​ చేసేయొచ్చు.

2. జెర్సీ

ఇంటర్నెట్​ వేగంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఈ దేశంలో సెకనుకు 218.37 ఎంబీపీఎస్ స్పీడ్​తో ది జేర్సీ బాయ్ మూవీని 10.4 సెకన్లలో డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

1. లిక్టేంస్టెయిన్​

ప్రపంచంలోనే హై స్పీడ్​ ఇంటర్నెట్ గల ఈ దేశంలో ఎస్​ క్లబ్ సెవెన్​ గ్రేటెస్ట్ హిట్స్ ఆల్బబ్​ను 229.98 ఎంబీపీఎస్​ వేగంతో 0.05 సెకన్లలో డౌన్​లోడ్ చేయొచ్చు.

డేటా ధరలు తక్కువగా ఉన్న దేశాలు

ఇంటర్నెట్ వేగంలో పైన చెప్పిన దేశాలు టాప్​లో ఉండగా.. అత్యంత చౌకగా డేటా ధరలు ఉన్న దేశాల్లో మాత్రం భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఒకప్పుడు ఒక్క జీబీ డేటాకు రూ.100వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితిలో ఉన్న మన దేశంలో జియో రాకతో విప్లవాత్మక మార్పు వచ్చింది. డేటా ధరలు అందరికీ అందుబాటులో ఉన్నాయి.

దేశం1 జీబీ డేటా ధర
1భారత్​0.09 డాలర్లు
2ఇజ్రాయెల్​0.11 డాలర్లు
3కిర్జిస్థాన్​0.21 డాలర్లు
4ఇటలీ0.43 డాలర్లు
5ఉక్రెయిన్​0.46 డాలర్లు

డేటా ధరలు ఎక్కువగా ఉన్న దేశాలు

దేశం1 జీబీ డేటా ధర
1మలావి27.41 డాలర్లు
2బెనిన్​27.22 డాలర్లు
3చాడ్​23.33 డాలర్లు
4యెమెన్​15.98 డాలర్లు
5బోట్స్​వానా13.87 డాలర్లు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.