ETV Bharat / priya

బొజ్జ గణపయ్య మెచ్చే నైవేద్యాలు.. మీరూ ట్రై చేయండి!

author img

By

Published : Sep 9, 2021, 5:11 PM IST

Updated : Sep 9, 2021, 5:29 PM IST

గణేష్ చతుర్థికి (vinayaka chavithi) పులిహోర, లడ్డూలే కాదు ఎంతో రుచికరమైన పాయసాలు (payasam) కూడా సిద్ధం చేస్తుంటారు. మరి ఈ చవితి సందర్భంగా పాలతాలికలు, సగ్గు బియ్యం ఖర్జూర బెల్లం పాయసం లాంటివాటిని ఎలా తయారు చేసుకోవాలో చూడండి.

payasam recipe
పాయసం చేసే విధానం

వినాయక చవితి (vinayaka chavithi) ఎంతో ప్రత్యేకమైన పండగ. విగ్రహాలు, పూజల దగ్గర నుంచి వంటకాల వరకు భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు. దేవుడి నైవేద్యంగానే కాక అతిథులకు, ఇంట్లో వారికోసమూ ఎన్నో రకాల రుచులు సిద్ధమవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇక చవితి కోసమే ప్రత్యేకంగా చేసుకోవాల్సిన పాయసాలు (payasam) ఏంటో, వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

పాలతాలికలు

కావాల్సినవి:

బెల్లం, బియ్యపు పిండి, పాలు, సగ్గుబియ్యం, యాలకుల పొడి, చక్కర, డ్రై ఫ్రూట్స్

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో బెల్లం, నీళ్లు, బియ్యపు పిండి వేసి కలుపుకొని పిండికి సరిపడా పాలు పోసి తడుపుకోవాలి. ఇలా తడుపుకొన్న పిండిని తాలికలు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద మరుగుతున్న పాలలో సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు పాలతాలికలు కూడా ఉడుకుతున్న సగ్గుబియ్యంలో వేసి, యాలకుల చక్కర పొడి వేసి కలుపుకొన్న తర్వాత.. ముందుగా ఫ్రై చేసిపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్​ వేసి కలుపుకొని బౌల్​లోకి సర్వ్​ చేసుకుంటే పాలతాలికలు రెడీ.

బియ్యం పిండి పాయసం

కావాల్సినవి:

బియ్యం, పాలు, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, ఎండు కొబ్బరి, కిస్​మిస్

తయారీ విధానం:

నానబెట్టిన బియ్యాన్ని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని బియ్యం ముద్ద వేసి, పాలు పోసి ఒక ఉడుకు వచ్చాక బెల్లం వేసి కరగనివ్వాలి. తర్వాత ప్యాన్​ పెట్టుకొని నెయ్యి, జీడిపప్పు, ఎండు కొబ్బరి పలుకులు, కిస్​మిస్​లు వేయించి.. ఉడుకుతున్న పాయసంలో వేసుకుంటే బియ్యం పాయసం సిద్ధం.

సగ్గు బియ్యం- ఖర్జూర బెల్లం పాయసం

కావాల్సినవి:

నెయ్యి, బాదం, కాజు, కిస్​మిస్, సగ్గుబియ్యం, పాలు, ఖర్జూర బెల్లం, ఖర్జూరం, యాలకుల పొడి

తయారీ విధానం:

ముందుగా ఇత్తడి గిన్నెలో నెయ్యి వేసి వేడెక్కాక బాదం, కాజు, కిస్​మిస్, నానపెట్టిన సగ్గుబియ్యం, కొన్ని నీళ్లు పోసి ఒకసారి మరిగిన తర్వాత అందులో పాలు పోసి మరోసారి మరిగిన తర్వాత అందులో ఖర్జూర బెల్లం వేసి, బాగా కలుపుకొని అందులో యాలకుల పొడి వేసుకొని బాగా మరిగిన తర్వాత దించుకుంటే సగ్గు బియ్యం ఖర్జూర బెల్లం పాయసం రెడీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Ragi Laddu: రుచికరమైన 'రాగి ఓట్స్ లడ్డూ'

Last Updated :Sep 9, 2021, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.