ETV Bharat / priya

వెజ్ దమ్​ బిర్యానీ.. ఇలా చేస్తే అదరహో!

author img

By

Published : Oct 12, 2021, 5:04 PM IST

Vegetable Dum Biryani recipe
వెజ్​ దమ్ బిర్యానీ

వీకెండ్​ అంటే బయట రెస్టారెంట్​కు వెళ్లే ప్లాన్స్ వేస్తున్నారా?. అలా వెళ్లినప్పుడు బిర్యానీ తినడం (Vegetable Dum Biryani) మామూలే. మరి ఇంట్లో ఉండే వారి పరిస్థితి ఏంటి? ప్రతి వారాంతం లాగా కాకుండా జస్ట్ ఫర్​ ఏ ఛేంజ్​ మన చేతులతో మనమే వెజ్​ బిర్యానీని చేసుకుని తింటే ఎలా ఉంటుంది?

చాలామంది వీకెండ్​ ప్లాన్స్​లో వంట తయారు చేయడం (Vegetable Dum Biryani in telugu) కచ్చితంగా పెట్టుకుంటారు. వారం అంతా కష్టపడి.. వారాంతాల్లో నచ్చింది చేసుకుని తింటే ఆ మజానే వేరు. అలాంటి వారికి సింపుల్​గా బెస్ట్​ అండ్​ టేస్టీ ఫుడ్​.. వెజ్ దమ్​​ బిర్యానీ. దీన్ని ఇంట్లోనే ఎలా (Vegetable Dum Biryani) తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా మరి!

Vegetable Dum Biryani recipe
వెజ్​ దమ్ బిర్యానీ

కావల్సిన పదార్థాలు:

నూనె, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠాణీ, ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్​, అల్లం వెల్లుల్లి పేస్ట్​, పెరుగు, పుదీనా, కొత్తిమీర, సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా, నిమ్మరసం, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, షాజీర, ఇలాచి, లవంగాలు, సరిపడా ఉప్పు, నానబెట్టిన బాస్మతీ బియ్యం, నెయ్యి.

తయారీ విధానం:

ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని అందులో కట్​ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠాణీ వేసి డీప్​ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని పై నుంచి ఫ్రైడ్​ ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్​, అల్లం వెల్లుల్లి పేస్ట్​, పెరుగు, కట్​ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమానికి సరిపడా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. అందులో నిమ్మరసం, వేడి నూనె కలిపి మూతపెట్టి ఉడికించుకోవాలి. మరుగుతున్న నీళ్లలో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, షాజీర, ఇలాచి, లవంగాలు, సరిపడా ఉప్పు, నానబెట్టిన బాస్మతీ బియ్యం వేసి ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న వెజ్​ మిశ్రమంలో బాస్మతీ అన్నం వేసి పైనుంచి నెయ్యి వేసి మూతపెట్టుకుని 10 నుంచి 15 నిమిషాలు దమ్ చేసుకుంటే వెజ్ దమ్​ బిర్యానీ తయారవుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: దమ్​ బిర్యానీ సరిగా కుదరడం లేదా?.. ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.