ETV Bharat / priya

క్రిస్పీ క్రిస్పీ ఎగ్ పకోడి.. భలే టేస్ట్​ గురూ!

author img

By

Published : Aug 16, 2021, 4:50 PM IST

egg pakoda
ఎగ్​ పకోడా

కోడిగుడ్డుతో ఏం చేసినా అదిరిపోతుంది.. ప్రోటీన్లు పుష్కలంగా నిండిన గుడ్డుతో రకరకాల రెసిపీలు ట్రై చేసి ఉంటారు. ఈ సారి ఎగ్​ పకోడా చేసుకోండి. వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారుచేయాలంటే?

ఇంట్లో అరడజను కోడిగుడ్లు ఉన్నాయంటే చాలు.. వాటితో భోజనంలోకి నోరూరించే పదార్థాలే కాదు.. సరదాగా స్నాక్స్‌ కూడా చేసుకోవచ్చు. వాతవారణం చల్లగా ఉంటే పకోడి తినాలని చాలా మంది అనుకుంటారు కదా. ఆ పకోడిలో ఉడికించిన గుడ్డు ముక్కలు కలిపి చేస్తే ఉంటుంది బాసూ రచి అదిరిపోతుంది అంతే. మీకూ తినాలని ఉందా? అయితే ఓ సారి దీని తయారీ విధానం చూసేయండి..

కావాల్సిన పదార్థాలు

4 ఉడికించిన కోడిగుడ్లు

శనగపిండి 1 కప్పు

బియ్యపుపిండి రెండు టేబుల్​ స్పూన్లు

అల్లంవెల్లుల్లి పేస్ట్​​ ఓ టీ స్పూన్​

పసుపు చిటికెడు

వాము ఓ టీ స్పూన్​

తరిగిన పచ్చిమిరపకాయలు మూడు

జీలకర్ర టీ స్పూన్​

కారం, ఉప్పు తగినంత

వంట సోడా చిటికెడు

కొత్తి మీర కొద్దిగా

నూనె డీఫ్రై​కు సరిపడ.

తయారీ విధానం

ఒక బౌల్​లో శనగపిండి, బియ్యపుపిండి , అల్లంవెల్లుల్లి పేస్ట్​, పసుపు, కారం, వాము, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర పొడి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిని శనగపిండి మిశ్రమం అంటారు.

మరోవైపు ఉడకించిన కోడిగుడ్డును ముక్కలు చేసి.. అందులో కారం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ కోడి గుడ్డు ముక్కలను శనగపిండి మిశ్రమంలో ముంచి కాగే నూనేలో వేయాలి. అనంతరం డీఫ్రై చేసుకోవాలి. అంతే క్రిస్పీ ఎగ్​ పకోడా రెడీ.

ఇదీ చూడండి: నోరూరించే ఎగ్ వెరైటీస్.. మీరూ ఓ లుక్కేయండి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.