ETV Bharat / lifestyle

ఇలా చేస్తే జుట్టు రాలడం నివారించవచ్చు..!

author img

By

Published : Mar 6, 2021, 3:30 PM IST

tips for thick hair and remedy for hairfall
ఇలా చేస్తే జుట్టు రాలడం నివారించవచ్చు

కొవిడ్‌ బారినపడ్డ చాలామంది జుట్టు రాలడం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో వాడిన యాంటీ వైరల్స్‌, స్టెరాయిడ్ల వల్ల ఇలా జరుగుతుందని ప్రముఖ కాస్మటాలజిస్ట్ డాక్టర్ శైలజ సూరపనేని అన్నారు. ఒత్తిడి, భయం, నీరసం, వ్యాధినిరోధక శక్తి తగ్గడం వల్లా ఈ ఇబ్బంది రావొచ్చని తెలిపారు. మరి తిరిగి ఈ జుట్టు వస్తుందా? ఉన్న జుట్టు రాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె ఏం చెప్పారంటే..

తినే పదార్థాల్లో జింక్‌, ఇనుము, ఫోలిక్‌యాసిడ్లు ఉండేలా చూసుకోవాలి. అలానే విటమిన్‌-ఎ ఎక్కువగా ఉండే చిలగడదుంప, పాలకూర, క్యారెట్లు, పాలు, గుడ్లు తీసుకోవాలి. వీటితో పాటు విటమిన్‌-డి లభించే చేపలు, పుట్టుగొడుగులు వంటివి తినాలి. తృణధాన్యాలు, బాదం, మాంసం, చేప, ఆకుకూరల్లో బయోటిన్‌ దొరుకుతుంది. స్ట్రాబెర్రీలు, కమలాలు, జామకాయలు వంటి పండ్లలో విటమిన్‌-సి ఉంటుంది. విటమిన్‌-ఇ, ప్రొటీన్‌ లభించే పనీర్‌, పొద్దు తిరుగుడు గింజల్నీ తరచూ తింటే మంచిది. నువ్వులను బెల్లంతో కలిపి తినొచ్చు. గుమ్మడిగింజలు, గోధుమగడ్డి, కందిపప్పు, సెనగపప్పులో జింక్‌ దొరుకుతుంది. ఈ పోషకాలన్నీ కలగలిసిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చు.

జాగ్రత్తలు: శారీరక వ్యాయామం, ధ్యానం తప్పనిసరి. రోజూ ఎనిమిది గ్లాసుల మంచినీళ్లు తాగాలి. హెయిర్‌డైలు, ఇతర రసాయన చికిత్సలకు దూరంగా ఉండాలి. గాఢత తక్కువగా ఉండే షాంపూ ఉపయోగించాలి. తలస్నానం తర్వాత కండిషనర్‌ వాడాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే ఊడిన జుట్టు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయినా ఫలితం లేకపోతే డాక్టర్‌ని సంప్రదిస్తే విటమిన్‌, బయోటిన్‌ ట్యాబ్లెట్లు ఇస్తారు. అలాగే ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా(పీఆర్‌పీ) పద్ధతి ద్వారా కూడా జుట్టు ఊడటాన్ని నియంత్రించవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.