ETV Bharat / lifestyle

Dry Fruits Sales in Dewali: దీపావళి సందర్భంగా డ్రై ఫ్రూట్స్​కి పెరిగిన డిమాండ్

author img

By

Published : Nov 2, 2021, 12:53 PM IST

Dry Fruits
డ్రై ఫ్రూట్స్

ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకునే వెలుగుల పండగ దీపావళి. దీపపు ప్రమిదలతో ఇంటిని అందంగా అలంకరించడమే కాకుండా... ప్రత్యేక పూజలు నిర్వహించటం ఈ పండగ ప్రత్యేకత. అందులో భాగంగా బంధుమిత్రులు, ఉద్యోగులకు బహుమతులిచ్చి సంతోషపర్చడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలోని ఎండు ఫలాల దుకాణాలు సందడిగా మారాయి.

తెలుగు రాష్ట్రాల్లోని ఊరూవాడా దీపావళి పండుగ హడావిడి మొదలైంది. వెలుగుల పండగ సందర్భంగా బంధుమిత్రులకు బహుమతులిచ్చి వారి కళ్లల్లో ఆనందం నింపడం ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తోంది. ఇక విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఎండు ఫలాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉంది. ఖాజూ, బాదం, పిస్తా, కిస్మిస్, ఖర్జూరం లాంటి ఫలాలు ఇక్కడ ఎక్కువగా అమ్ముడవుతాయి. దీపావళి పండగ సందర్భంగా నగరంలోని ఎండు ఫలాలు విక్రయించే దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి.

డ్రై ఫ్రూట్స్​కి పెరిగిన డిమాండ్


నాణ్యమైన డ్రై ఫ్రూట్స్

ఎండు ఫలాలు మధురమైన రుచితోపాటు మంచి పోషక విలువలను ఇస్తాయి. తిన్న వెంటనే ఒంటికి సత్తువ లభిస్తుంది. అందుకే వీటిని బహుమతిగా ఇవ్వడం దశాబ్దాల నుంచి ఆచారంగా వస్తోంది. దీంతో దుకాణాల నిర్వాహకులు వాటిని ఆకట్టుకునే విధంగా అందమైన ప్యాకెట్లలో ఏర్చి.. కూర్చి ఇస్తున్నారు. జంట నగరాల్లో మంచి నాణ్యత కలిగిన ఫలాలు అందుబాటులో ఉన్నాయని వినియోగదారులు అంటున్నారు. ముఖ్యంగా కరోనా వల్ల ఎండు ఫలాల డిమాండ్ పెరిగిందని... ఖర్చు ఎక్కవ అయినా.. ప్రస్తుత సమయంలో రోగ నిరోధక శక్తి పెంచేందుకు దోహదం చేస్తున్నాయని వెల్లడించారు.

డ్రై ఫ్రూట్స్.. స్వీట్స్ కన్నా మంచివి కాబట్టి వీటినే గిఫ్ట్​గా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం. అసలే కరోనా సమయం. ఇలాంటి పరిస్థితుల్లో డ్రైఫ్రూట్స్ ఇమ్యూనిటీని పెంచుతాయి కాబట్టి.. బంధుమిత్రులకు వీటినే గిఫ్ట్​గా ఇస్తున్నాం. ధర ఎక్కువే అయినా.. ఆరోగ్యానికి మంచిది కాబట్టి వెనుకడుగు వేయకుండా పండుగ పూట అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.

-కొనుగోలుదారులు

హైదరాబాద్​లోని బేగంబజార్​లో ఎండు ఫలాలు విక్రయించే దుకాణాలు వందల సంఖ్యలో ఉన్నాయి. వివిధ రకాల ఎండు ఫలాలను వివిధ రకాలుగా పేర్చి... అందమైన గిఫ్ట్ ప్యాకెట్లుగా తీర్చిదిద్ది అమ్ముతున్నారు. 200 గ్రాములు మొదలుకుని రెండు కిలోల వరకు ఎండు ఫలాలను గిఫ్ట్ ప్యాకెట్లుగా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. వీటిని బంధుమిత్రులు, సన్నిహితులు, ఉద్యోగులకు బహుమతులుగా ఇవ్వడానికి ఓ హోదాగా భావిస్తారు. ఈ సంస్కృతి ఇటీవల విపరీతంగా పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు. అలాగే కరోనా వల్ల గత రెండు ఏళ్లుగా గిరాకీ లేదని... కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎండు ఫలాలు కొనేందుకు వినియోగదారులు వస్తున్నారని తెలిపారు.

చాలా మంచిగా వ్యాపారం సాగుతోంది. గతేడాది ఉన్న రేట్లే ఇప్పుడు కొనసాగుతున్నాయి. రేట్లలో పెద్దగా మార్పేమి రాలేదు. ఈ డ్రైఫ్రూట్స్ గిఫ్ట్​లలో 20 రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. కరోనా సమయంలో గిరాకీ లేదనుకున్నా.. ఇలాంటి పండుగల సమయాల్లో ఆదాయం లభిస్తోంది.

-దుకాణదారులు

ప్రధాన మార్కెట్ అయిన బేగంబజార్ పాటు నగరంలోని పలు ప్రాంతాల్లోనూ వీటి విక్రయాలు ఊపందుకున్నాయి. అయితే గతంతో పోలిస్తే ఈసారి గిరాకీ... కొంత తగ్గిందని మరికొందరు వ్యాపారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: డ్రైఫ్రూట్స్ తింటే గుండెకు మంచిది కాదా?

తాజా పళ్ల కన్నా డ్రై ఫ్రూట్స్​ మంచివా?

Afghanistan crisis: అఫ్గానిస్థాన్‌ ప్రభావంతో పెరిగిన డ్రై ఫ్రూట్స్ ధరలు

Cyber Crime: కిలో బాదం రూ.300, జీడిపప్పు రూ.500..!

dry fruits: డ్రైఫ్రూట్స్‌ వ్యాపారంతో... కోట్లు సంపాదిస్తోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.