ETV Bharat / sukhibhava

డ్రైఫ్రూట్స్ తింటే గుండెకు మంచిది కాదా? - గుండె ఆరోగ్యం

శరీరానికి పోషకాలు, రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కోసం ఎండు ఫలాలను తింటుంటాం. అయితే మనం తినే డ్రైఫ్రూట్స్​ అసలు మన గుండెకు మేలు చేస్తాయా? కీడు చేస్తున్నాయా? అనే విషయాన్ని తెలుసుకోండి.

dry fruits
డ్రైఫ్రూట్స్
author img

By

Published : Sep 1, 2021, 4:01 PM IST

నట్స్​ను నిత్యం తినటం వల్ల ఎన్నో రకాల లాభాలను పొందొచ్చు. శరీరానికి కావాల్సిన కీలక పోషకాలు వీటి ద్వారా అందుతాయి. రోజుకు గుప్పెడు డ్రై ఫ్రూట్స్​ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. మరి నట్స్​ తినడం వల్ల ఎలాంటి లాభాలు సమకూరుతాయో తెలుసుకుందాం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, పల్లీలు, ఎండు ద్రాక్ష, అంజీర్, అక్రోట్​, పిస్తాల్లాంటివి నట్స్​ కిందకు వస్తాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాదు అద్భుతమైన న్యూట్రిషన్స్​ కలిగి ఉంటాయి. వీటిని రోజుకు గుప్పెడు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్​ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. వీటిని తీసుకోవడం ద్వారా విటమిన్స్​, మినరల్స్​ కావాల్సినంత శరీరానికి అందుతాయి. ఒకే రకం నట్స్​ కాకుండా అన్ని రకాలు కలిపి తీసుకుంటే మరీ మంచిది.

డ్రై ఫ్రూట్స్​- గుండెకు ఎంతో మేలు

నట్స్​ నిత్యం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు, క్యాన్సర్, అకాల మరణం బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

నట్స్​లో గుండెకు మేలు చేసేవి ఏవి?

వాల్​నట్స్​, జీడిపప్పు, బాదం, పిస్తా, అక్రోట్, నువ్వులు, పల్లీలు, ఆయిల్​ సీడ్స్​ లాంటివి గుండెకు చాలా మంచివి. వాటిల్లో క్యాలరీలు, ఎనర్జీ ఉంటాయి. ఎత్తుకు తగ్గ బరువు ఉన్నవారు వారానికి మూడు సార్లు నట్స్​ తీసుకోవచ్చు. బరువు ఎక్కువగా ఉన్నవారు ఇలాంటి నట్స్​ను ఎక్కువగా తినకపోవడం మేలు.

ప్రధానంగా వాల్​నట్స్​ తినడం వల్ల శరీరంలోని చెడు కొలస్ట్రాల్​ పోయి మంచి కొలస్ట్రాల్ వస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండె సంబంధ వ్యాధులు దరిచేరవు.

ఇదీ చూడండి: కండరాలు బలంగా ఉండాలంటే ఇవి తినండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.