తాజావైనా, ఎండువైనా పండ్లు మంచి పోషకాల(vitamin c in dry fruit) గనులు. వీటిల్లో పీచు, పొటాషియం, రాగి, ఐరన్, క్యాల్షియం, విటమిన్లు వంటి ఎన్నో (nutrition in dry fruits) పోషకాలుంటాయి. అయితే ఎండు ఫలాలను తయారుచేసే క్రమంలో వేడికి గురిచేసినపుడు కొంతవరకు విటమిన్ సి తగ్గుతుంది. అంతేకాదు నీటి మోతాదు కూడా దాదాపు 80% వరకు తగ్గుతుంది.
కాబట్టి ఖర్జూరం, అంజీరా వంటి ఎండుఫలాల్లో కేలరీలు, చక్కెర దండిగా ఉంటాయి. పీచు కూడా ఎక్కువే. మామూలు ద్రాక్ష పళ్లలో 1.4 గ్రాముల పీచు ఉంటే.. ఎండు ద్రాక్షలో 5.4 గ్రాములు ఉంటుంది. కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల ఎండుఫలాలను మితంగానే తీసుకోవటం మంచిది. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునేవారు దీన్ని దృష్టిలో ఉంచుకోవటం మంచిది. రంగు చెడిపోకుండా ఉండటానికి కొన్ని పళ్లకు సల్ఫర్ డయాక్సైడ్ కూడా కలుపుతుంటారు. ఇది ఆస్తమా వంటి జబ్బులున్న వారికి ఇబ్బందులు తీసుకురావొచ్చు. కాబట్టి డ్రై ఫ్రూట్స్‌ను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతే తినటం మేలు.