ETV Bharat / jagte-raho

యువకునిపై కత్తితో దాడి... పరిస్థితి విషమం

author img

By

Published : Nov 1, 2020, 7:40 AM IST

Updated : Nov 1, 2020, 12:33 PM IST

attack
attack

హైదరాబాద్ నగర శివారు బాలపూర్ పోలీస్​స్టేషన్​ పరిధిలో దారుణం జరిగింది. ఓ యువనికిపై కత్తితో మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు.

యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన హైదరాబాద్ నగర శివారు బాలపూర్ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. షాహీన్​నగర్​కు చెందిన ఆమిర్ అలియాస్​ అబు అజర్ అనే యువకుడిపై సద్దాం అనే వ్యక్తి కత్తితో దాడి చేసి పారిపోయాడు.

రక్తపు మడుగులో ఉన్న ఆమిర్​ను కుటుంబ సభ్యులు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉన్నాయి.

ఇదీ చూడండి: మైనర్​ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

Last Updated :Nov 1, 2020, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.