ETV Bharat / jagte-raho

మైనర్​ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

ఇంట్లో నిద్రిస్తున్న మైనర్ బాలిక పట్ల వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

miss behavior towards a minor girl in suryapet district
మైనర్​ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

Published : October 31, 2020 at 10:42 PM IST

Choose ETV Bharat

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక (15)ను అదే గ్రామానికి చెందిన పులిగడ్డ ప్రభాకర్(28) అనే వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ నాలుగు రోజులుగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న బాలిక పట్ల ప్రభాకర్​ అసభ్యంగా ప్రవర్తించాడు.

బాలిక ప్రతిఘటించి.. గట్టిగా కేకలు వేయడం వల్ల అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.