ETV Bharat / jagte-raho

కొడాలి నాని హత్య కేసులో ఇద్దరి నిందితుల అరెస్ట్

author img

By

Published : Nov 6, 2020, 8:01 PM IST

two people arrested in murder case at khammam district
కొడాలి నాని హత్య కేసులో ఇద్దరి నిందితుల అరెస్ట్

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మామిడితోటలో జరిగిన కొడాలి నాని అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతన్ని చంపిన ఇద్దరినీ పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బంజర- బుచ్చిరెడ్డిపాలెం గ్రామాల మధ్య మామిడితోటలో జరిగిన కొడాలి నాని అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నాని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ, ఆమె భర్త కలిసి చంపినట్లు పోలీసులు తెలిపారు.

విచారణలో తేలిన హంతకులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఎర్రుపాలెం పోలీస్​ నిలయంలో మధిర సీఐ మురళి హత్య కేసు వివరాలను వెల్లడించారు.

ఇదీ చూడండి: అబద్ధాలు చెప్పి మోసం చేశాడు... హత్య జరిగినట్లు నాటకమాడాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.