ETV Bharat / bharat

వీడియో వైరల్​: స్నాక్స్​ తింటున్న బాలికలపై దూసుకొచ్చిన ఆవులు - ఏం జరిగిందో తెలిస్తే షాకే! - Cows Attack Three Girls Video Viral

author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 11:57 AM IST

Viral Video: సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యే వీడియోలు ఒక్కోసారి నవ్వులు తెప్పిస్తే.. మరికొన్ని సార్లు భయం కలిగిస్తాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో వైరల్​ అవుతుంది. స్నాక్స్​ తింటున్న ముగ్గురు అమ్మాయిలకు ఊహించని ఘటన ఎదురైంది!

Cows Attack Video Viral
Cows Attack Three Girls Video Viral (ETV Bharat)

Cows Attack Three Girls Video Viral: సోషల్​ మీడియా కొన్ని వీడియోలు తెగ వైరల్​ అవుతుంటాయి. క్షణాల్లోనే లక్షల వ్యూస్​ను సంపాదిస్తాయి. అయితే అలాంటి వీడియోల్లో నవ్వులు తెప్పించేవి ఉంటాయి, క్రియేటివ్​ ఐడియాస్​కు సంబంధించినవి ఉంటాయి. మరికొన్ని మాత్రం భయానకమైనవి కూడా ఉంటాయి. ఇలాంటి ఓ వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

వైరల్​ అవుతున్న వీడియో ప్రకారం.. ముగ్గురు బాలికలు రోడ్డు పక్కన ఓ షాపులోని బెంచిపై కూర్చుని స్నాక్స్​ తింటున్నారు. సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా.. అకస్మాత్తుగా రెండు ఆవులు (cows) పోట్లాడుకుంటూ బాలికల (girls) వైపు వచ్చాయి. వారిలో ఓ బాలిక వాటిని గమనించినా.. అప్పటికే అవి వారి పైకి దూసుకొచ్చాయి. రెండు ఆవులూ పోట్లాడుకుంటూ బాలికలపై పడ్డాయి.

ఆవుల దాడిలో ఓ బాలిక తప్పించుకోగా.. మిగతా ఇద్దరూ ఆవుల కింద పడ్డారు. చివరకు ఆ ఇద్దరిలో ఓ బాలిక తేరుకుని పక్కకు వెళ్లిపోయింది. కానీ మరో బాలిక మాత్రం నేలపై పడిపోయింది. అయినప్పటికీ ఆవులు తమ పోట్లాట ఆపలేదు. ఈ క్రమంలో కిందపడిపోయిన బాలిక అవుకాళ్ల కిందపడి తీవ్రంగా గాయపడుతుందేమో అనేంత భయానకంగా ఉంది అక్కడి వాతావరణం. అక్కడే ఉన్న కొందరు యువకులు వెంటనే అప్రమత్తమయ్యారు. కాసేపట్లో ఆవు సమీపానికి వచ్చిన ఓ వ్యక్తి.. బాలికను పట్టుకుని పక్కకు లాగేశాడు. చివరకు రెండు ఆవులు పోట్లాడుకుంటూ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు బాలికలకూ గాయాలైనట్లు తెలుస్తోంది.

ఆమ్లెట్ ఇలా కూడా వేస్తారా! - "అక్కా ఇన్ని రోజులు ఎక్కడున్నావ్​" అంటూ కామెంట్ల మోత!

అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియోను ఘర్ కే కాలేష్(Ghar ke Kalesh) అనే వ్యక్తి X లో పోస్ట్​ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రస్తుతం 2.4 మిలియన్స్​కు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. "ఇలాంటి ఘటనలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి".. అంటూ కొందరు, "‘ఆవులు, గేదెలు రద్దీ రోడ్ల పైకి రాకుండా చర్యలు తీసుకోవాలి"’.. అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు, అయ్యో పాపం అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోను చూసేయండి..

Viral Video : పాముకు ఊపిరి ఊది.. బతికించిన పోలీస్..! వీడియో వైరల్

Man Puts Poisonous Snake In to Mouth Viral Video : వీడెవడండీ బాబూ.. పాము మెడలో వేసుకొని.. తల నోట్లో పెట్టుకొని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.