ETV Bharat / jagte-raho

బయటపడ్డ పురాతన కుండ.. గుప్త నిధులంటూ ప్రచారం

author img

By

Published : Jan 17, 2021, 5:22 PM IST

కరీంనగర్‌ జిల్లాలో గుప్తనిధుల సమాచారం కలకలం రేపింది. హుజూరాబాద్‌ శివారులో ఓ రైతు వ్యవసాయ భూమిని చదును చేస్తుండగా ఓ పురాతన కుండ బయట పడింది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని మట్టి పాత్రను పరిశీలించారు.

The discovery of hidden treasures in the suburbs of Huzurabad in Karimnagar district has caused a stir.
కలకలం రేపిన గుప్తనిధుల సమాచారం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ శివారులో గుప్తనిధులు దొరికాయనే సమాచారం కలకలం రేపింది. పట్టణ సమీపంలోని రంగనాయకుల గుట్ట వద్ద రాజిరెడ్డి అనే రైతు తన వ్యవసాయ భూమిని చదును చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

చదును చేస్తుండగా..

జేసీబీ వాహనంతో భూమిని చదును చేస్తుండగా.. ఓ పురాతన కుండ బయటపడింది. ఈ విషయం దావానలంలా వ్యాప్తించటంతో.. స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ వాసంశెట్టి మాధవి, ఆర్‌ఐ సతీష్‌, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మట్టి పాత్రను పరిశీలించారు. రైతుతో మాట్లాడి పురావస్తు శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు.

గతంలో తవ్వకాలు ..

మట్టి పాత్రను చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. అక్కడ రైతుకు గుప్త నిధులు దొరికాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై స్పందించిన రైతు మట్టి పాత్ర పైభాగం కనబడటంతో పనులు నిలిపివేసి అధికారులకు సమాచారం అందించామని చెప్పాడు. గుట్ట పరిసర ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు గతంలో జరిగాయనే ప్రచారం కూడా ఉంది.

ఇదీ చదవండి:మంత్రి తలసానిని బర్తరఫ్ చేయాలి: గంగపుత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.