ETV Bharat / jagte-raho

కరోనా నిర్ధరణ పరీక్ష కోసం వెళ్తుండగా.. వైద్యుడి మృతి

author img

By

Published : Jun 1, 2020, 10:55 AM IST

కరోనా నిర్ధరణ పరీక్ష చేయించుకునేందుకు ద్విచక్రవాహనంపై ఆసుపత్రికి వెళ్తుండగా గేదెను ఢీకొని ఆర్​ఎంపీ వైద్యుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా తకళ్లపల్లె వద్ద చోటుచేసుకుంది.

rmp doctor died of accident while going for corona test in jagtial district
కరోనా నిర్ధరణ పరీక్ష కోసం వెళ్తుండగా.. వైద్యుడి మృతి

జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. నిర్ధరణకు ముందు జ్వరంతో ఉన్న ఆ మహిళకు చికిత్స చేసిన ఆర్​ఎంపీ వైద్యుడు అనుమానంతో కరోనా నిర్ధరణ పరీక్ష చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

కరోనా నిర్ధరణ పరీక్ష చేయించుకునేందుకు ద్విచక్రవాహనంపై జగిత్యాల ఆసుపత్రికి వెళ్తుండగా తకళ్లపల్లి వద్ద గేదె అడ్డురావడం వల్ల కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.