ETV Bharat / jagte-raho

మూడు నెలల క్రితమే పెళ్లి... ప్రైవేటు టీచర్ ఆత్మహత్య

author img

By

Published : Oct 28, 2020, 10:39 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తంగడపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మూడు నెలల క్రితమే వివాహమైన సాయి అనే ప్రైవేట్​ టీచరు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్కూళ్లు మూసేయడం వల్ల ఖాళీగా ఉంటున్న సాయి... భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

private teacher suicide in yadadri bhuvanagiri district
మూడు నెలల క్రితమే పెళ్లి... ప్రైవేటు టీచర్ ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మూడు నెలల క్రితం వివాహమైన ప్రైవేటు ఉపాధ్యాయుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

భార్య పుట్టింటికి వెళ్లగా...

పోలోజు సాయి అనే వ్యక్తి కొంతకాలంగా ప్రైవేటు పాఠశాలలో టీచర్​గా పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో స్కూళ్లు లేకపోవడం వల్ల ఇంట్లోనే ఖాళీగా ఉన్నారు. ఆయనకు 3 నెలల క్రితమే వివాహం జరిగింది. దసరా పండుగకు భార్య పుట్టింటికి వెళ్ళిన సమయంలో సాయి బలవన్మరణానికి పాల్పడ్డారు.

శోకసంద్రంలో..

ఒక్కగానొక్క కుమారుడు సాయి మృతి చెందడాన్ని జీర్ణించుకోలేని తల్లితండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మృతునికి పెద్దగా ఆర్థిక ఇబ్బందులు లేవని స్థానికులు చెబుతున్నారు. ఆత్మహత్య కారణాలపై స్పష్టత రాలేదు.

ఇదీ చదవండి: దంత వైద్యుడు హుస్సేన్ కిడ్నాప్​ కేసును ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.